'జ్యోతిలక్ష్మి' నుంచి కెల్విన్ అకౌంట్లో డబ్బులు: అడ్డంగా బుక్కైన పూరీ, నార్కోటిక్ పరీక్ష
హైదరాబాద్: డ్రగ్ సరఫరా నిందితుడు కెల్విన్‌తో కలిసి ఉన్న ఫోటోలను చూపించి ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు షాకిచ్చారు.
కెల్విన్‌తో పరిచయంపై పూరీ జగన్నాథ్ షాకింగ్, కానీ: పూరీతోనే రవితేజ, చార్మిలకు..
ఆయనను సిట్ అధికారులు బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రశ్నిస్తున్నారు. రాత్రి ఏడు గంటల వరకు ప్రశ్నించే అవకాశముంది. మధ్యాహ్నం అరగంట లంచ్‌కు సమయం ఇచ్చారు.
కాగా, పూరీకి నార్కోటిక్ పరీక్షలు చేసే అవకాశముంది. ఆయన మద్యం సేవించారా లేదా తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేయనున్నారని తెలుస్తోంది. రక్తనమూనాలు సేకరించే అవకాశముందని తెలుస్తోంది. ఉస్మానియా ఉస్మానియా నార్కోటిక్ అధికారులు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు.
బ్యాంకాక్ వెళ్లేది డ్రగ్స్ కోసమా: ప్రశ్నలతో పూరీ ఉక్కిరిబిక్కిరి, కార్యాలయం వద్ద సాయిరాం హంగామా

ఆధారాలు ముందు పెట్టారు
విచారణలో అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కెల్విన్‌తో పరిచయం గురించి పూరీ జగన్నాథ్ వెల్లడించారు. అయితే, అంతకుముందు అతను ఎవరో తెలియదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు ఆధారాలు ముందు పెట్టారని తెలుస్తోంది.


జ్యోతిలక్ష్మి ఆడియో వేడుకలో.. అకౌంట్లలో డబ్బులు..
జ్యోతిలక్ష్మి ఆడియో వేడుకలో వీరు ఉన్నట్లు సిట్ అధికారులు పూరీకి చూపించారు. అలాగే, కెల్విన్ అకౌంట్లలోకి పూరీ జగన్నాథ్ డబ్బులు పంపిన ఆధారాలు చూపించారు. అయితే, జ్యోతిలక్ష్మి ఈవెంట్ కోసం కెల్విన్‌కు డబ్బులు పంపినట్లు పూరీ జగన్నాథ్ వెల్లడించారని తెలుస్తోంది.

పబ్బులో రెండుసార్లు కలిశా..
కెల్విన్, జీషన్లతో కలిసి ఉన్న ఫోటోలను సిట్ అధికారులు పూరీ జగన్నాథ్‌కు చూపించారు. మీతో డ్రగ్ సరఫరాదారులు కలిసి ఉన్నారుగా అని అడిగితే.. తనకు పరిచయం ఉందని చెప్పారు. పబ్బులో రెండుసార్లు కలిసినట్లు చెప్పారని తెలుస్తోంది. అయితే అతనితో రెగ్యులర్ సంభాషణ మాత్రం లేదని చెప్పాడని సమాచారం. కానీ డ్రగ్స్ సప్లయర్స్ అని తర్వాత తెలిసిందన్నారు.

పూరీ విచారణ ఇలా.. ఒక్కొక్కరు ఒక్కో అంశంపై..
కాగా, పూరీ జగన్నాథ్‌ను ఎక్సైజ్ శాఖలోని సెక్షన్ 67 ప్రకారం సిట్ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. డ్రగ్ కేసులో బుధవారం నుంచి రోజుకు ఒకరి చొప్పున 12 మంది సినీ తారలను విచారించనున్న విషయం తెలిసిందే. పూరీని విచారిస్తున్న నలుగురు అధికారులు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై విచారిస్తున్నారు. అధికారులు అకున్ సబర్వాల్, అంజిరెడ్డి, శీలం శ్రీనివాస్, శ్రీనివాస్ రావులు విడతలవారీగా విచారించారని తెలుస్తోంది.

ప్రశ్నలు ఇలా..
కెల్విన్ ఎలా పరిచయమయ్యాడు? పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట, ఎందుకు? కెల్విన్, జిషన్ మీ ఇంటికి ఎందుకు వచ్చారు? ఎంతకాలంగా డ్రగ్స్ వాడుతున్నారు? కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందిస్తారు? కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు, ఎలా సరఫరా చేశారు?, చార్మి ముమైత్, రవితేజ, సుబ్బరాజులకు డ్రగ్స్, కొకైన్ మీ నుంచే వెళ్లిన మాట నిజమా కాదా? డ్రగ్స్ తీసుకున్నాక కొద్ది రోజులు హైదరాబాదులో ఎందుకు ఉండరు? బ్లడ్ టెస్టులకు సిద్ధమా? అనే ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!