వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలన మలుపు: ఒకే అపార్టుమెంట్‌లో చార్మీ-కమింగా? మరిన్ని షాకింగ్ విషయాలు

డ్రగ్ రాకెట్ కేసులో నెదర్లాండ్‌కు చెందిన మైక్ కమింగాను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ బుధవారం వెల్లడించింది. ఓ వైపు సినీ తారలను విచారిస్తున్న సమయంలో కీలకవ్యక్తిని అరెస్టు చేయడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్ రాకెట్ కేసులో నెదర్లాండ్‌కు చెందిన మైక్ కమింగాను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ బుధవారం వెల్లడించింది. ఓ వైపు సినీ తారలను విచారిస్తున్న సమయంలో కీలకవ్యక్తిని అరెస్టు చేయడం గమనార్హం.

చదవండి: అది తెలియదన్న చార్మీ, లంచ్‌లో 'ప్రత్యేకం': రేపు ముమైత్ వంతు

సినీతారలు ఇచ్చిన సమాచారం మేరకే అతనిని అరెస్టు చేశారా అనే చర్చ సాగుతోంది. డ్రగ్ రాకెట్‌లో నటి చార్మి సహా పలువురిని సాక్షులుగానే పిలిచినట్లు సిట్ అధికారులు చెప్పారు. అయితే, మైక్ కమింగా అరెస్టు అనంతరం కొత్త అనుమానాలు వస్తున్నాయి.

చదవండి: డ్రగ్స్ కేసులో మరో కీలక అరెస్ట్: సిట్ ముందుకు ముసుగు వ్యక్తి.. చార్మి చెప్పిందనే?

ఈ మేరకు, డ్రగ్ కేసులో కీలక మలుపు అని, చార్మిని ప్రశ్నించిన రోజే కమింగను సిట్ అరెస్టు చేసిందని, కొత్త లింక్ ఒకటి కనిపెట్టిందని, ఇందుకు సంబంధించిన వివరాలు తాము సంపాదించామని ఓ టీవీ ఛానల్ సంచలన విషయాలు వెల్లడించింది.

ఒకే అపార్టుమెంటులో చార్మి, కమింగా

ఒకే అపార్టుమెంటులో చార్మి, కమింగా

నెదర్లాండ్‌కు చెందిన కమింగా భారత్‌కు డ్రగ్స్ తీసుకు వచ్చేవాడని సిట్ గుర్తించింది. టూరిస్ట్ వీసాపై నాలుగుసార్లు భారత్ వచ్చాడని, అందులో రెండుసార్లు హైదరాబాద్ వచ్చాడని చెబుతున్నారు. నటి చార్మీ, మైక్ కమింగాలు ఒకే అపార్టుమెంటులో ఉంటున్నట్లు తేలిందని సదరు ఛానల్ పేర్కొంది. చార్మీ ఇచ్చిన సమాచారంతో అరెస్టు చేశారా లేక అంతకుముందు సినీ స్టార్స్ ఇచ్చిన సమాచారంతో అరెస్టు చేశారా తెలియాల్సి ఉందని అంటున్నారు.

Recommended Video

Subba Raju Reveals Star Family's Name In SIT Investigation
కేసులో మరిన్ని మలుపులు

కేసులో మరిన్ని మలుపులు

నానక్‌రాంగూడలోని జయభేరీ ఆరెంజ్ కౌంటీలో మైక్ కమింగా నివసిస్తున్నాడని తేలిందని చెబుతున్నారు. అతను ఓ బ్లాక్‌లో ఉంటుండగా, అదే అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో వేరే బ్లాక్‌లో చార్మీ ఉంటోందని పేర్కొంటున్నారు. చార్మీతో పాటు మరికొందరు సినీ తారలు అందులో ఉంటున్నారని, దీంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగటం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

కమింగా భారత్‌కు ఇలా

కమింగా భారత్‌కు ఇలా

కమింగా అపార్టుమెంటులో ఏడాదిగా నివసిస్తున్నారని తేలిందని పేర్కొన్నారు. అప్పుడప్పుడు స్వదేశం వెళ్తున్నాడని తెలిసింది, సాఫ్టువేర్ కంపెనీ తరఫున ఉద్యోగ కోణంలో లీగల్ పత్రాలు సృష్టించి ఎవరికీ అనుమానం రాకుండా అతను భారత్ వీసా పొంది వచ్చాడని తేలిందని సమాచారం. 2018 వరకు అతని వీసా గడువు ఉంది.

భారతీయురాలితో పెళ్లి

భారతీయురాలితో పెళ్లి

కమింగా ఓ భారతీయురాలిని పెళ్లి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోందని చెబుతున్నారు. కమింగా, సినీ తారలు ఒకేచోట ఉండటం అనుమానాలకు తావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయని అంటున్నారు. చార్మీతో అనేక సంభాషణలు జరిగాయని, అనేక పార్టీలకు కలిసి వెళ్లారని కూడా తెలుస్తోందని పేర్కొన్నారు. అయితే, చార్మిని కేవలం సాక్షిగానే పిలిచారు. కాబట్టి ఆమెకు అతనితో లింక్ ఉందా లేదా దర్యాఫ్తులో తేలుతుంది.

సాఫ్టువేర్ రంగానికి కూడా కమింగానే

సాఫ్టువేర్ రంగానికి కూడా కమింగానే

కమింగా ఐటీ ఉద్యోగిగా వచ్చాడు. కాబట్టి సాఫ్టువేర్ కంపెనీలకు కూడా ఆయననే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సిట్ భావిస్తోందని సమాచారం. అంతేకాదు, కమింగా కాల్ లిస్టులో 1500 మంది సాఫ్టువేర్ ఇంజినీర్ల నెంబర్లు ఉన్నాయని తెలుస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీలకు డ్రగ్స్ సరఫరా చేయడంలోను కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు.

English summary
In a key development in the Hyderabad drug racket, Telangana’s Excise Authorities have arrested a Dutch national, an official said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X