వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్ రాకెట్లో వ్యాపారవేత్తలు: విచారణలో 'పెద్ద' పేర్లు, అందుకే అథ్లెటిక్ డోపింగ్ మిషన్

డ్రగ్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలువురు వ్యాపారులకు కూడా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలువురు వ్యాపారులకు కూడా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇచ్చింది.

డ్రగ్స్: రేవంత్ రెడ్డిపై నాయిని సంచలనం, బిజెపి నేత ఘాటు కౌంటర్డ్రగ్స్: రేవంత్ రెడ్డిపై నాయిని సంచలనం, బిజెపి నేత ఘాటు కౌంటర్

ఇందులో భాగంగా మంగళవారం ముగ్గురు వ్యాపారులను ప్రశ్నించింది. బానోతు సౌరభ్, ఆకుల రితికేష్, అంకిత్ అగర్వాల్ అనే ముగ్గురు వ్యాపారులను సిట్ విచారించింది.

రెండేళ్లుగా కెల్విన్ నుంచి కొనుగోలు

రెండేళ్లుగా కెల్విన్ నుంచి కొనుగోలు

డ్రగ్ సరఫరాదారు కెల్విన్ నుంచి పెద్ద మొత్తంలో వారు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించిందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా వారు డ్రగ్స్ వాడుతున్నారని గుర్తించారని తెలుస్తోంది.

వీరి విచారణ..

వీరి విచారణ..

మరోవైపు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు సుమారు నాలుగైదు గంటలు విచారించారు. పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నాలను ఇప్పటి దాకా దర్యాఫ్తు బృందం విచారించింది.

విచారణలో 'పెద్ద' పేర్లు.. అందుకే అథ్లెటిక్ డోపింగ్ మిషన్

విచారణలో 'పెద్ద' పేర్లు.. అందుకే అథ్లెటిక్ డోపింగ్ మిషన్

విచారణలో పలువురు పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లను వీరు వెల్లడించినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే, ఆధారాలు లేకుండా ఎవరికీ నోటీసులు ఇవ్వలేమని అంటున్నారు. నార్కోటిక్‌తో పాటు అథ్లెటిక్ డోపింగ్ టెస్ట్ మిషన్ తెచ్చి పరీక్షిస్తామని చెబుతున్నారు.

గుడ్డిగా విచారించలేరు

గుడ్డిగా విచారించలేరు

విచారణలో పలువురు పెద్ద నిర్మాతలు, హీరోల పేర్లు చెబుతున్న నేపథ్యంలో గుడ్డిగా నోటీసులు ఇవ్వలేరు. అలాగే, వారిని కూడా గుడ్డిగా విచారించలేరు. అందుకే ఎక్సైజ్ అధికారుల నోట్ అథ్లెటిక్ డోపింగ్ టెస్ట్ మిషన్ అని వచ్చిందని అంటున్నారు. కేసులో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్ తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయడంపై ఎక్సైజ్ శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

English summary
Special Investigation Team (SIT) has qustioned three Businessman in excise office on Tuesday in drug racket case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X