• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

థర్డ్ లిస్ట్‌లో యంగ్ హీరోయిన్స్, నేతల పిల్లలు?: ఆరుగురి పేర్లు బయటకొస్తే పెద్ద కుదుపు

|

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ దందాలో తొలి నిందితుడిగా ఉన్న కెల్విన్, ఆదివారం విచారణలో మరిన్ని వివరాలు వెల్లడించాడని తెలుస్తోంది. తొలి జాబితాలో భాగంగా నోటీసులు పంపించింది.

ఆ తర్వాతే సినీ స్టార్ల పేర్లు వెల్లడి, డబ్బుల్లేకపోతే నగ్న వీడియోలు పంపేవారు..

వారిని విచారించాల్సి ఉంది. సిట్ రెండో జాబితా కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పుడు కెల్విన్ చెప్పిన వివరాలతో మూడో జాబితా కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.

తాజా జాబితాలో గత నాలుగైదేళ్లుగా రాణిస్తున్న యంగ్ హీరోయిన్స్ పేర్లు కూడా ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. వారితో పాటు పలువురు రాజకీయ నాయకుల తనయులు, హై ప్రొఫైల్ ప్రముఖులు, పేజ్ 3 సెలబ్రిటీల పేర్లు వెల్లడైనట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, కెల్విన్ పోలీసు కస్టడీ ఆదివారం ముగుస్తుంది. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ పొడిగింపును కోరుతూ సోమవారం సిట్ బృందం కోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది.

కెల్విన్‌తో పాటు, అతని వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న వారందరినీ మరింత లోతుగా విచారించిన మీదటే సిట్ ముందడుగు వేయనుంది.

ఆ ఆరుగురి పేర్లు చెబితే..

ఆ ఆరుగురి పేర్లు చెబితే..

కాగా, విచారణ పూర్తయిన అనంతరం ఎక్సైజ్ అధికారులు మరో ఆరుగురు కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరి విషయంలో అన్ని కోణాల్లోను దర్యాఫ్తు జరిపి, మరిన్ని అంశాలు నిర్ధారించుకున్న తర్వాత నోటీసులు ఇవ్వనున్నారు. ఈ ఆరుగురి పేర్లు బయటపెడితే ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రముఖ నిర్మాతల వారసులు జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిద్దరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు, అతని సోదరుడు, మరో ఫైట్ మాస్టర్ ఉన్నారని ప్రచారం సాగుతోంది.

  Navadeep in Drugs Scandal, Top Tollywood Actors Trying to Save him
  కెల్విన్ అండ్ కో వాట్సాప్

  కెల్విన్ అండ్ కో వాట్సాప్

  ఫేస్‌‌బుక్‌ తదితర సోషల్ మీడియాల ద్వారా, కోడ్‌ భాషలో మాట్లాడుకుంటూ, ఆర్డర్లు తీసుకుంటూ దందాను నడిపించారు. గోవా నుంచి రోడ్డు మార్గంలో డ్రగ్స్‌ రవాణా చేయడంతో పాటు, గత రెండు సంవత్సరాలుగా జర్మనీ, నెదర్లాండ్స్‌ తదితర దేశాల నుంచి కొరియర్‌ ద్వారా మత్తుమందులు తెప్పించారు. తమ వ్యాపార విస్తరణకు వేరే ముఠాతో డీల్ కుదుర్చుకున్నాడు.

  పేపర్ అంటే డ్రగ్

  పేపర్ అంటే డ్రగ్

  టూ పేపర్స్ ప్లీజ్ అని మెసేజ్ వస్తే, కలెక్ట్ ఫ్రమ్ బాయ్ అని సమాధానం వస్తుంది. ఆపై వేర్ అని అడిగితే, ఔటర్ అన్న సందేశం వస్తుంది. ఇదంతా వాట్సాప్‍‌లో సాగేది. ఇక్కడ పేపర్ అంటే డ్రగ్స్, బాయ్ అంటే కొరియర్.

  వారి పేర్లు బయటపెట్టాడా?

  వారి పేర్లు బయటపెట్టాడా?

  కెల్విన్ విచారణలో మరో ప్రముఖ దర్శకుడు, నటి పేర్లను బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే, అతనితో పాటు.. ఖుద్దూస్, వాహిద్‌‌ల కస్టడీని మరోసారి కోరనున్నారు.

  బ్యాంకు

  బ్యాంకు

  తాను ఎవరినీ నేరుగా కలవలేదని, వారికి కోడ్ ప్రకారం డ్రగ్స్ సరఫరా చేసేవాడినని కెల్విన్ సిట్ అధికారుల విచారణలో చెప్పాడని తెలుస్తోంది. వారంతా క్రెడిట్ కార్డుల ద్వారా తన ఖాతాకు డబ్బులు వేసేవారని కెల్విన్ చెప్పడంతో బ్యాంకు ఖాతాలపై పోలీసులు కన్నేశారు. బ్యాంకు ఖాతాలనూ పరిశీలించాలని నిర్ణయించారు.

  ఆ సంబంధాలు మాత్రం లేవని..

  ఆ సంబంధాలు మాత్రం లేవని..

  తనకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని కెల్విన్ విచారణలో చెప్పాడని సమాచారం. పేరున్న పాఠశాలల్లోని పిల్లలకు డ్రగ్స్ సరఫరా వెనుక వారి ఆసక్తిని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన మాత్రమేనని వెల్లడించాడు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Charges of narcotic drugs usage continued to shake Telugu film industry for the third consecutive day on Friday with seven persons acknowledging notices from the investigators.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more