మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెలకు రూ.15లక్షల మామూళ్లు: ఎస్ఐ ఆత్మహత్యపై డీఎస్పీ, ఖండన

|
Google Oneindia TeluguNews

మెదక్: తన వేధింపుల కారణంగానే కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్తల్లో వాస్తవం లేదని సిద్దిపేట డీఎస్పీ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఎస్ఐ రామకృష్ణా రెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

తన ఆత్మహత్యకు డీఎస్పీ, ఇద్దరు సీఐల వేధింపులే కారణమని ఎస్ఐ రామకృష్ణా రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. నెలకు రూ. 15 లక్షలు మామూళ్లను డీఎస్పీకి పంపుతున్నానని, అయినా తనను వేధింపులకు గురిచేస్తున్నారని సూసైడ్ నోట్‌లో వెల్లడించారు.

నెలకు 15లక్షల మామూళ్లు: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య నెలకు 15లక్షల మామూళ్లు: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

కాగా, ఈ ఆరోపణల నేపథ్యంలో డీఎస్పీ శ్రీధర్ స్పందించారు. ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణపై ఓ అవినీతి కేసు పెండింగ్‌లో ఉందని చెప్పారు. వాహన ప్రమాదం, కేసును తప్పుదోవ పట్టించడంపై కేసులున్నాయని తెలిపారు. ఈ కేసుపై 15రోజుల క్రితమే తాను విచారణ ప్రారంభించామని చెప్పారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలిపారు.

తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుకోవచ్చని, తాను అందుకు సహకరిస్తానని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. విచారణ పూర్తయితేనే ఆ ఆరోపణల్లో నిజం ఎంత ఉందో తెలుస్తుందని అన్నారు.

ఎస్ఐ మృతదేహం తరలింపు

ఎస్ఐ మృతదేహం తరలింపు

తన వేధింపుల కారణంగానే కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్తల్లో వాస్తవం లేదని సిద్దిపేట డీఎస్పీ సీహెచ్ శ్రీధర్ తెలిపారు.

ఆస్పత్రి వద్ద గుమిగూడిన జనం

ఆస్పత్రి వద్ద గుమిగూడిన జనం

బుధవారం తెల్లవారుజామున ఎస్ఐ రామకృష్ణా రెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

రోదిస్తున్న కుటుంబసభ్యులు

రోదిస్తున్న కుటుంబసభ్యులు

తన ఆత్మహత్యకు డీఎస్పీ, ఇద్దరు సీఐల వేధింపులే కారణమని ఎస్ఐ రామకృష్ణా రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

ఎస్ఐ రామకృష్ణ మృతదేహం

ఎస్ఐ రామకృష్ణ మృతదేహం

నెలకు రూ. 15 లక్షలు మామూళ్లను డీఎస్పీకి పంపుతున్నానని, అయినా తనను వేధింపులకు గురిచేస్తున్నారని సూసైడ్ నోట్‌లో వెల్లడించారు.

ఎస్ఐ రామకృష్ణ (ఫైల్)

ఎస్ఐ రామకృష్ణ (ఫైల్)

ఈ ఆరోపణల నేపథ్యంలో డీఎస్పీ శ్రీధర్ స్పందించారు. ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణపై ఓ అవినీతి కేసు పెండింగ్‌లో ఉందని చెప్పారు. వాహన ప్రమాదం, కేసును తప్పుదోవ పట్టించడంపై పిటిషన్‌లున్నాయని తెలిపారు. ఈ కేసుపై 15రోజుల క్రితమే తాను విచారణ ప్రారంభించామని చెప్పారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలిపారు.

English summary
Siddipet DSP Ch. Shridhar who has been accused of harassing and pushing the Kuknoorpally SI to suicide, claimed that the allegations in the suicide note were false. He said that he was trying to figure out why the SI would write such a note against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X