హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ వరదలు : 3 నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

గత 10 రోజులుగా హైదరాబాద్‌లో నిత్యం వర్షం కురుస్తూనే ఉంది. ఏ క్షణాన ఎప్పుడు హఠాత్తుగా మబ్బులు కమ్ముకుంటాయో... ఎప్పుడు వాన మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు ఉదయం పూట ఎండ కనిపించినప్పటికీ... హఠాత్తుగా మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. వరుసగా కురుస్తున్న ఈ భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో రూ.5వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం చాలామంది ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తన 3 నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా తమవంతుగా తెలంగాణ రాష్ట్రానికి రూ.2కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటించింది. ఈ మేరకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో బెంగాల్ తెలంగాణకు అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. బెంగాల్ ఆర్థిక సాయానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

hyderabad floods union minister kishan reddy donates his three months salary

అంతకుముందు,హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల కోసం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. తెలంగాణ‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా సీఎం ప‌ళ‌నిస్వామికి మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

టాలీవుడ్ హీరోలు సైతం తమవంతుగా సహాయక చర్యలకు భారీ విరాళాలు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ రూ.1కోటిన్నర,మెగాస్టార్ చిరంజీవి రూ. 1 కోటి, నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, మహేష్ బాబు రూ. 1 కోటి,విజయ్ దేవరకొండ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. వీరితో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ రూ.5 లక్షలు, మరో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు.

English summary
Union Minister Kishan Reddy announced that he is donating his three months salary to Telangana CM relief fund to take measures against Hyderabad floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X