హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా అబద్దం: ఇవాంకా 'ఖర్చు'పై కేటీఆర్, 'ఖాకీ దుస్తుల్లో ఒక్కరు మించి వద్దు'

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లకు మరమ్మత్తులు చేస్తున్నారని, ఇందుకోసం భారీగా ఖర్చు పెడుతున్నారనే ప్రచారం జరిగింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లకు మరమ్మత్తులు చేస్తున్నారని, ఇందుకోసం భారీగా ఖర్చు పెడుతున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

అంతా అబద్దం

అంతా అబద్దం

ఇవాంకా పర్యటన ఉన్నందునే రోడ్లు బాగు చేస్తున్నామనేది అబద్దమని కేటీఆర్ స్పష్టం చేశారు. వర్షాకాలం వెళ్లినందున రహదారుల మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. చార్మినార్ వద్ద కూడా అభివృద్ధి పనులను కూడా ఇవాంకా కారణంగానే అనుకుంటున్నారని, కానీ అవి ముందస్తు ప్రణాళికలు అని చెప్పారు. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

అమెరికా ఆయుధాలకు అనుమతించండి

అమెరికా ఆయుధాలకు అనుమతించండి

కాగా, గ్లోబల్‌ ఎంటర్ ప్రెన్యూర్‌ సదస్సుకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పాత బస్తీలో 40 వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అతిథులు బస చేసే హోటళ్ల వద్ద పోలీసు భద్రతను పటిష్ఠం చేస్తున్నారు. సదస్సుకు ఇవాంకా వస్తున్నందున ఆమె భద్రతా చర్యల్లో భాగంగా అమెరికా నుంచి తెచ్చుకునే ఆయుధాలకు అనుమతి కోరుతూ అమెరికా భద్రతా విభాగం మన కస్టమ్స్‌ అధికారులకు లేఖ రాసింది.

భద్రతా చర్యల్లో భాగమే

భద్రతా చర్యల్లో భాగమే

అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు తేవడం భద్రతా చర్యల్లో భాగమే అయినా, కస్టమ్స్‌ అనుమతి అనివార్యమైన నేపథ్యంలో లేఖ పంపినట్లుగా తెలుస్తోంది. అమెరికా పోలీసులు నెల రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసి ఎస్పీజీ బలగాలతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలతో రెండు రోజుల అంతర్గత సమావేశాలను శుక్రవారం ప్రారంభించారు. శంషాబాద్‌ నుంచి మాదాపూర్‌ వరకు, అటునుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌ వరకూ రిహార్సల్స్‌ నిర్వహించారు. భద్రతా చర్యలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్‌ కమిషనర్‌ సందీప్‌శాండిల్య సమీక్షిస్తున్నారు.

ఇవాంకా భద్రతా విషయంలో

ఇవాంకా భద్రతా విషయంలో

ఇవాంకా భద్రత విషయంలో అమెరికా భద్రతా విభాగం మొదటి నుంచి పలు సూచనలు చేస్తోంది. భద్రతా సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంచరాదని, తక్కువ సిబ్బందిని సమావేశ మందిరంలో ఉంచాలని చెబుతున్నాయి. సమావేశ మందిరంలో ప్రతినిధులతో పాటు 50 మంది సుశిక్షితులైన సిబ్బంది భద్రతా విధుల్లో సివిల్ డ్రెస్సులో ఉంటారు.

యూనిఫాంలో ఒక్క అధికారి మాత్రమే

యూనిఫాంలో ఒక్క అధికారి మాత్రమే

కేవలం ఒక్క ఐపీఎస్‌ అధికారి మాత్రమే పోలీస్‌ యూనిఫాంలో ఉండేందుకు అమెరికా అధికారుల నుంచి అనుమతి లభించింది. సమావేశ మందిరం బయట, హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరిస్తారు.

English summary
The United States Secret Service will be bringing its own team of sniffer dogs for security checks at various venues, where the US President’s daughter Ivanka Trump will be visiting or staying when in the city for Global Entrepreneurs Summit this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X