హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీని 4సార్లు రప్పించుకొని, ఫోటో తీసి బ్లాక్‌మెయిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను దేవుడి ప్రతినిధిని అంటూ ఓ వివాహితను బెదిరించిన 25 ఏళ్ల నకిలీ బాబాను సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి నుండి ఒక మొబైల్ ఫోన్‌ను, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ (నేరాలు) పాలరాజు మంగళవారం మాట్లాడుతూ నిందితుడిని రిమాండుకు తరలించినట్లు చెప్పారు.

తమిళనాడులోని వెల్లూరుకు చెదిన షౌకత్ హుస్సేనే హైదరాబాద్ వచ్చి మత ప్రచారం చేస్తూ.. తాను దేవుడికి ప్రతినిధిని అని చెప్పుకునే వాడు. టోలీచౌకీలో ఉంటున్న ఓ మహిళ తన వ్యక్తిగత సమస్యలతో బాధపడుతూ షౌకత్ వద్దకు వెళ్లింది.

Hyderabad: 'godman' arrested for molestation, extortion

తాను తమిళనాడు నుండి పవిత్రమైన మందును తీసుకు వచ్చానని ఆమెతో చెప్పాడు. తాను చెప్పిన ప్రాంతానికి ఒంటరిగా రావాలి కోరాడు. దీంతో ఆమె అక్కడకు వెళ్లింది. ఉపదేశం పేరుతో ఆమె నుదుటి పైన పసరు పూసి ఫోటోలు తీశాడు. మరో మూడుసార్లు వేర్వేరు ప్రాంతాలకు పిలిపించి అలానే చేశాడు.

కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేసి లక్ష రూపాయల డబ్బు కావాలని అడిగాడు. లేదంటే తాను తీసిన ఫోటోలను భర్తకు పంపిస్తానని, అలాగే తాము పలుమార్లు కలుసుకున్న విషయాన్ని చెబుతానని బెదిరించాడు. దీంతో బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు ఆమెతో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడు.

English summary
A 25 year old man from Tamil Nadu, who posed as a godman, was today arrested here on the charges of molestation and blackmailing, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X