• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పరువు హత్య: నీరజ్ హత్య కేసులో కర్ణాటకలో నిందితుల అరెస్ట్, సోదరులేనంటూ సంజన, ఆమె తల్లి మరోలా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్ పన్వార్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంజన బాబాయి కుమారులు స్నేహితులతో కలిసి నీరజ్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్య చేసిన అనంతరం నిందితులు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు.

నీరజ్ పన్వార్ హత్య కేసులు నలుగురు నిందితుల అరెస్ట్

నీరజ్ పన్వార్ హత్య కేసులు నలుగురు నిందితుల అరెస్ట్

నీరజ్ హత్య అనంతరం నిందితులు ద్విచక్రవాహనాలపై పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన నిందితులను ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు నీరజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు అనంతరం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.

నీరజ్ భార్యతోపాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నీరజ్ పన్వార్ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బేగంబజార్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు నిరసనగా దుకాణాల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా బేగంబజార్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. బందోబస్తును వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీ, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

నీరజ్-సంజన ప్రేమ పెళ్లిన వ్యతిరేకించిన యువతి ఫ్యామిలీ

నీరజ్-సంజన ప్రేమ పెళ్లిన వ్యతిరేకించిన యువతి ఫ్యామిలీ

హత్యకు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్​ బేగంబజార్‌లో తండ్రి రాజేందర్​నాథ్‌తో కలిసి వేరుశనగ గింజల(పల్లీల) వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో నివాసం ఉండే సంజనతో నీరజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత సంవత్సరం పాతబస్తీలోని గణేశ్‌ మందిరంలో వారు వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారం తెలియకపోవడం.. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటంతో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతోషంగా జీవిస్తున్న నీరజ్-సంజన..

సంతోషంగా జీవిస్తున్న నీరజ్-సంజన..

ఈ క్రమంలో అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి ప్రాణభయం ఉందంటూ నవదంపతులు అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేజర్లు కావటంతో పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. దీంతో 'నీరజ్‌-సంజన తమ కాపురాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు. వీరికి రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. అప్పటికే నీరజ్‌పై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా హతమార్చాలని కుట్రపన్నారు. కొద్ది రోజులుగా నీరజ్‌ కదలికలపై నిఘా పెట్టిన దుండగులు.. రెక్కీ నిర్వహించారు.

నీరజ్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు

నీరజ్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు

శుక్రవారం రాత్రి తన తాతయ్యతో కలిసి నీరజ్‌ బయటికి వెళ్లి వస్తుండగా వెంబడించి ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. అతడి తల, మెడపై 20సార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల వద్ద కత్తులు చూసి భయాందోళనకు గురైన స్థానికులు వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక రక్తపుమడుగులో పడి ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే నీరజ్‌ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.

సోదరులే హత్య చేశారంటూ సంజన.. ఆమె తల్లి మాత్రం మరోలా..

సోదరులే హత్య చేశారంటూ సంజన.. ఆమె తల్లి మాత్రం మరోలా..

కాగా, తన సోదరులే నీరజ్‌ను హత్య చేశారని సంజన్ ఆరోపించింది. తన రెండు నెలల బాబుతో కలిసి బేగంబజార్ కూడలిలో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు సంజన. నీరజ్‌ను హత్య చేసిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సంజన తల్లి మధుబాయి మాట్లాడుతూ.. తన కూతురు సంసారాన్ని నాశనం చేశారని వాపోయింది. హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ కుటుంబ ప్రమేయం లేదని తెలిపింది. తమ కుటుంబీకులంతా శుక్రవారం ఇంట్లోనే ఉన్నారని తెలిపింది. అయితే, హత్య జరిగిన విషయం తెలిసి పారిపోయారని సంజన సోదరి తెలిపింది.

English summary
Hyderabad honour killing: four accused arrested in Neeraj panwar murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X