హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అబ్బురపర్చేలా ప్రపంచ ఐటి కాంగ్రెస్: కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో 2018లో జరిగే ప్రపంచ ఐటి కాంగ్రెస్‌ను అబ్బురపర్చేలా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో 2018వ సంవత్సరంలో నిర్వహించనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌పై చర్చించడానికి నాస్కాం అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బివిఆర్ మోహన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు, సిఎం చీఫ్ సెక్రటరీ నర్సింగరావు, ఐటి శాఖ కార్యదర్శి హర్ ప్రీత్‌సింగ్ పాల్గొన్నారు. ప్రపంచ ఐటి కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని నాస్కాం అధ్యక్షుడు ముఖ్యమంత్రిని కోరారు. దీనికి స్పందించిన కెసిఆర్ హైదరాబాద్‌లో ప్రపంచ ఐటి కాంగ్రెస్ 2018(డబ్ల్యూసిఐటి) నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రపంచ దేశాలు అబ్బురపర్చేలా నిర్వహిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్‌లో ఐదువేల ఎకరాల్లో ఐటి స్మార్ట్ సిటీని నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో రెండు హెలిప్యాడ్‌లు, నివాస, వర్తక సముదాయాలు, పార్కులు తదితర వసతులు ఉంటాయన్నారు.

సిఎం కెసిఆర్

సిఎం కెసిఆర్

అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్‌లో ఐదువేల ఎకరాల్లో ఐటి స్మార్ట్ సిటీని నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో రెండు హెలిప్యాడ్‌లు, నివాస, వర్తక సముదాయాలు, పార్కులు తదితర వసతులు ఉంటాయన్నారు.

కెసిఆర్

కెసిఆర్

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో 2018వ సంవత్సరంలో నిర్వహించనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌పై చర్చించడానికి నాస్కాం అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బివిఆర్ మోహన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్‌లో ప్రపంచ ఐటి కాంగ్రెస్ 2018(డబ్ల్యూసిఐటి) నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలు అబ్బురపర్చేలా నిర్వహిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు.

కెటిఆర్

కెటిఆర్

ఈ సందర్భంగా మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ.. ఐటి రంగంలో హైదరాబాద్ నగరం త్వరలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని వెల్లడించారు.

కెటిఆర్

కెటిఆర్

2018వ సంవత్సరంలో హైదరాబాద్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్‌లు సంయుక్తంగా అంతర్జాతీయ ఐటీ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఐటీపై నిర్దిష్టమైన ఆలోచన, స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు.

కెటిఆర్

కెటిఆర్

ప్రతి రెండేండ్లకు ఒకసారి ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించే ఈ అంతర్జాతీయ ఐటీ సదస్సు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ర్టానికి గర్వకారణం అన్నారు.

మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ.. ఐటి రంగంలో హైదరాబాద్ నగరం త్వరలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని వెల్లడించారు. 2018వ సంవత్సరంలో హైదరాబాద్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్‌లు సంయుక్తంగా అంతర్జాతీయ ఐటీ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఐటీపై నిర్దిష్టమైన ఆలోచన, స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు.

ప్రతి రెండేండ్లకు ఒకసారి ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించే ఈ అంతర్జాతీయ ఐటీ సదస్సు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ర్టానికి గర్వకారణం అన్నారు. ఈ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు నాస్కామ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే ఐటీ పరిశ్రమకు కేంద్రమైన హైదరాబాద్ ఈ సదస్సు అనంతరం మరింతగా విస్తరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో జరిగే ఐటీ సదస్సుకు ప్రపంచంలోని 80 దేశాలకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ఐటీ దిగ్గజాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ వివిధ దేశాల్లో పర్యటించే సందర్భంలో షెడ్యూల్ ఆధారంగా ఆయా దేశాల్లోని ఐటీ దిగ్గజాలను స్వయంగా ఆహ్వానిస్తారని కేటీఆర్ తెలిపారు.

2018లో ప్రపంచ ఐటీ సదస్సును సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా 2016లో బ్రెజిల్‌లో నిర్వహించే సదస్సును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని పంపనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సదస్సు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతామని, ఒకవేళ కేంద్రం సహకరించకపోయినా నిధుల కొరత లేదని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడబోమని కేటీఆర్ వెల్లడించారు.

English summary
Telangana Chief Minister K Chandrashekar Rao has agreed to the request of R Chandrasekhar, president, NASSCOM and BVR Mohan Reddy, vice chairman NASSCOM to host the ‘World Congress on Information Technology’ (WCIT) in Hyderabad in February 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X