ఏడేళ్ల సహజీవనం.. ప్రేమ పేరుతో మోసం: బాహుబలి పెంపుడు తండ్రి అరెస్ట్..

Subscribe to Oneindia Telugu
  ‘బాహుబలి’ తండ్రి ఐమాక్స్ వెంకట్ అరెస్ట్..

  హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఘటనలో ప్రసాద్స్ ఐమాక్స్ మేనేజర్ వెంకటర్ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో కొంతకాలం సహజీవనం చేసిన వెంకట్.. తీరా ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.

   ఐమాక్స్ యువతితో:

  ఐమాక్స్ యువతితో:

  హైదరాబాద్, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10లో నివాసముండే ఓ యువతి (33) ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ లో పనిచేస్తోంది. పదేళ్ల క్రితమే ఆమెకు వివాహమైనప్పటికీ.. భర్తతో విబేధాల కారణంగా విడిగా ఉంటోంది. విడాకుల కేసు కోర్టులో ఉంది. ఇదే క్రమంలో ఐమాక్స్ మేనేజర్ వెంకట ప్రసాద్ ఆమెతో మాటలు కలిపి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు.

  ఏడేళ్ల సహజీవనం

  ఏడేళ్ల సహజీవనం

  ప్రేమిస్తున్నానని యువతిని నమ్మించాడు. విడాకులు రాగానే పెళ్లి చేసుకుందామని కూడా చెప్పాడు. దీంతో యువతి అతని మాటలు నమ్మి సహజీవనానికి ఒప్పుకుంది. ఏడేళ్ల సహజీవనంలో.. పలుమార్లు గర్భస్రావం కూడా అయింది. పెళ్లయ్యాకే పిల్లల్ని కందామని చెప్పడంతో దానికి కూడా ఆమె అడ్డు చెప్పలేదు.

   బాహుబలిలో అవకాశం:

  బాహుబలిలో అవకాశం:

  యువతితో సహజీవనం కొనసాగిస్తున్న క్రమంలోనే ప్రసాద్ కు బాహుబలి సినిమాలో అవకాశం వచ్చింది. సినిమాలో ప్రభాస్ పెంపుడు తండ్రిగా ప్రసాద్ నటించాడు. తాజా హిట్ మూవీ గరుడవేగ లోను సీఎం పీఎగా నటించాడు.

  ఇలా వెలుగులోకి:

  ఇలా వెలుగులోకి:

  సినిమాల్లో ప్రసాద్ కు అవకాశాలు పెరుగుతున్న క్రమంలోనే.. ఆ యువతికి కోర్టు నుంచి విడాకులు కూడా మంజూరయ్యాయి. దీంతో పెళ్లి చేసుకుందామని ప్రసాద్ కు చెప్పింది. ప్రసాద్ మాత్రం ఆమె నుంచి తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ.. నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

  ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా.. ప్రసాద్ చాలామంది యువతులను మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో 420, 506,509, 354(డి) కింద కేసులు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hyderabad police arrested Imax manager Venkat Prasad for cheating woman in the name of love

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి