• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా ఇవాంకా: హోటల్లో ఇలా, ఇవాంకా కోసం సిటీలో రోడ్డెక్కారు!

|
  Global Entrepreneurship Summit : Ivanka Trump reached HICC, Video

  హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ట్రంప్ హోటల్లో అందరితో కలివిడిగా నడుచుకుంటున్నారు. ఆమె మంగళవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లారు.

  మధ్యాహ్నం గం.2.50 నిమిషాల దాకా హోటల్లోనే బస చేయనున్నారు. ఈ సమయంలో ఆమె హోటల్లో సరదాగా, అందరితో కలివిడుగా ఉంటున్నారని తెలుస్తోంది. అధికారులను, సిబ్బందిని పరిచయం చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

  ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భోజనం ఖరీదు రూ.18 వేలు: ఈ హోటల్ అద్భతాలు ఎన్నో

  ఉత్సాహంగా పలకరిస్తున్న ఇవాంకా ట్రంప్

  తనను పలకరిస్తున్న వారితో ఇవాంకా ఉల్లాసంగా ఉత్సాహంగా మాటలు కలిపారు. నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఆమెకు ఉదయం అమెరికా రాయబారి కెనెట్, కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం హోటల్ వద్ద వారు ఇద్దరికి స్థానిక అధికారులను, హోటల్ మేనేజ్‌మెంట్‌ను పరిచయం చేశారు.

  ఇవాంకాతో కలిసి వేదికపై కేటీఆర్: రామ్ చరణ్, సానియాల ప్రసంగం

  అల్పాహారం తీసుకొని

  ఈ సమయంలో వారితో ఇవాంకా కలివిడిగా మాట్లాడారని తెలుస్తోంది. అనంతరం ఉదయం కాసేపు విశ్రాంతి తీసుకుని స్వల్పంగా అల్పాహారం స్వీకరించినట్టుగా తెలుస్తోంది. అప్పుడు కూడా తనకు కనిపించిన ప్రతి వారినీ అమె పలకరిస్తూనే ఉన్నారని అంటున్నారు.

  ఇవాంకా కాన్వాయ్‌లో 17 అమెరికా వాహనాలు

  అమెరికా నుంచి వచ్చిన ఇవాంక కాన్వాయ్ లో 17 యూఎస్ వాహనాలే ఉండటం గమనార్హం. ఆమె పర్యటన కోసం అమెరికా నుంచి సొంత బులెట్ ప్రూఫ్ వాహనాన్ని తెప్పించారు. హోటల్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని 150 భవనాల నుంచి అక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు పహారా కాస్తున్నాయి.

  ఇవాంకా కోసం రోడ్డెక్కారు

  ఇదిలా ఉండగా, ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో ఆమె ప్రయాణించే ప్రాంతంలో రోడ్లు బాగు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలో పలువురు ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు. ఇవాంకా మా ప్రాంతానికి రా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

   ఇవాంకా, సికింద్రాబాద్ రా

  ఇవాంకా, సికింద్రాబాద్ రా

  తెలంగాణ కాంగ్రెస్ కార్య‌కర్త‌ల‌తో కలిసి కొందరు స్థానికులు 'ఇవాంకా, ద‌య‌చేసి సికింద్రాబాద్‌కి రా' అని ప్ల‌కార్డులు ప్రదర్శించారు. ఇది సంగీత్ క్రాస్‌రోడ్స్ వద్ద కనిపించింది. క‌నీసం ఇవాంకా వస్తేనైనా త‌మ ప్రాంతం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

  ఖండించిన అధికారులు

  ఖండించిన అధికారులు

  అయితే వీరి నిర‌స‌న‌ల‌కు గ‌ల కార‌ణాల‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఖండించారు. ఇవాంకా ట్రంప్ సంద‌ర్శించ‌బోని ప్రాంతాలను కూడా బాగుచేసేందుకు ప్ర‌భుత్వం చాలా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టింద‌ని చెబుతున్నారు.

  చదవండి: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ మరిన్ని కథనాలు

  English summary
  Ivanka Trump, daughter and advisor to US President Donald Trump, arrived in Hyderabad for the Global Entrepreneurship Summit in the wee hours on Tuesday. Ivanka Trump directly drove to Hotel Trident in Madhapur in a special vehicle that came from the USA.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more