వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్:ఎల్‌ఐసీ డబ్బులు క్లైయిమ్, పోలీసులకు చిక్కాడిలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:భీమా సొమ్మును బతికుండగానే తప్పుడు సర్టిఫికెట్లతో క్లైయిమ్ చేసుకొన్న నిందితులను హైద్రాబాద్ పోలీసులు బుధవారం నాడు హైద్రాబాద్‌లో అరెస్ట్ చేశారు.ఇప్పటికే ఒక దఫా భీమా సొమ్మును క్లైయిమ్ చేసుకొన్న ఘటన చోటు చేసుకొంది. మరో దఫా భీమా సొమ్మును మరోసారి క్లైయిమ్ చేసుకొనేందుకు ధరఖాస్తు చేసుకోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన అరిపిరాల రవిశంకర్ శర్మ ఈ కుట్రకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించిన వారిని అరెస్ట్ చేసినట్టు తూర్పు మండల డీసీపీ శశిధర్ రాజు చెప్పారు

ఈ కేసుకు సంబంధించిన వివరాలను తూర్పు డిసీపీ శశిధర్ రాజు బుధవారం నాడు మీడియాకు వివరించారు.భీమా సొమ్మును క్లైయిమ్ చేసుకొనేందుకు ప్రభుత్వాధికారులను కూడ ఉపయోగించుకొన్నారని పోలీసులు తెలిపారు.

బతికుండగానే చనిపోయినట్టుగా తప్పుడు పత్రాలు

బతికుండగానే చనిపోయినట్టుగా తప్పుడు పత్రాలు

ప్రకాశం జిల్లా అరిపిరాల రవిశంకర్ శర్మ ప్రకాశం జిల్లాలో ఎల్‌ఐసీలో బీమా చేయించుకొన్నాడు. ఈ పాలసీని హైదరాబాద్‌ పుత్లీబౌలి బ్రాంచ్‌కు బదిలీ చేయించుకున్నాడు. ఇదే మాదిరిగా మరో మూడు పాలసీలు చేయించుకున్నాడని చెప్పారు.అయితే, సొమ్ము కోసం తాను చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి బీమా సొమ్మును కాజేశాడు. మరోసారి తాను చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాన్ని తయారు చేయించుకుని అతని భార్య ఉషశ్రీ ద్వారా బీమా సొమ్మును డ్రా చేశారని తూర్పు డీసీపీ శశిధర్ రాజు చెప్పారు.

తప్పుడు పత్రాలతో మరోసారి ధరఖాస్తు

తప్పుడు పత్రాలతో మరోసారి ధరఖాస్తు

తొలిసారి రవిశంకర్ శర్మ ఎల్‌ఐసీ భీమా డబ్బులను క్లైయిమ్ చేసుకొన్నాడు. అయితే మరోసారి భీమా డబ్బుల కోసం క్లైయిమ్ చేశారు.ఒకే మరణ ధ్రువపత్రం వేర్వేరు సమయాల్లో లబ్ధి పొందడానికి ఉపయోగించుకోవడంతో అనుమానం వచ్చిన ఎల్‌ఐసీ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపారు. ఒకే వ్యక్తి పేరుతో మరోసారి ధరఖాస్తు రావడంతో విచారణ జరిపితే క్లైయిమ్‌లు విచారణ జరపడంతో రవిశంకర్ శర్మ భాగోతం వెలుగు చూసింది.

బతికే ఉన్నాడని గుర్తించిన ఎల్‌ఐసీ అధికారులు

బతికే ఉన్నాడని గుర్తించిన ఎల్‌ఐసీ అధికారులు


ఒకే ధరఖాస్తు రెండు దఫాలు రావడంతో విచారణ చేసిన ఎల్‌ఐసీ అధికారులకు ఒక విషయం వెలుగు చూసింది. రవిశంకర్ శర్మ బతికే ఉన్నాడని గుర్తించారు. రవిశంకర్ శర్మ బతికే ఉన్నాడని గుర్తించిన విషయం తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.డబ్బుల కోసం కావాలనే చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి మోసం చేశాడని గుర్తించి సుల్తాన్‌ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

నిందితులను అరెస్ట్

నిందితులను అరెస్ట్


ఎల్‌ఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు రవిశంకర్ శర్మ, అతని భార్య ఉషశ్రీ, నకిలీ ధ్రువపత్రాల జారీకి సహకరించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఖాజా ఆరీఫుద్దీన్‌తో పాటు మరొకరు ముజీబుల్లాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో భీమా డబ్బులను క్లైయిమ్ చేసిన విషయాన్ని నిందితులు ఒప్పుకొన్నారు.వారి నుంచి రూ.65వేలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండలం డీసీపీ శశిధర్‌రాజు తెలిపారు.

English summary
A 38-year-old man was arrested by the Sultan Bazaar police on Wednesday for forging his death to claim his life insurance. A Ravi Sankar Sarma, a trader from Nalgonda, conspired with his wife and two others to execute his plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X