హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్‌లైన్‌లో వల: భార్య,భర్తల పక్కా ప్లాన్, టెక్కీకి చుక్కలు, చివరికిలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా ఓ వ్యక్తిని ప్రేమ పేరుతో లోబర్చుకొని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడిన భార్య, భర్తలపై కేసు నమోదు చేసిన ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది, డబ్బుల కోసం వేరే వ్యక్తిని ప్రేమ పేరుతో ఛాటింగ్‌లు చేసింది ఆ వివాహిత. డబ్బులు ఇవ్వకపోవడంతో ఛాటింగ్ మేసేజ్‌లు బయటపెడతామని బెదిరింపులకు కూడ పాల్పడ్డారు. బాధితుడు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

డబ్బుల కోసం ఛాటింగ్ ద్వారా అమ్మాయిలు వల వేయడం చూశాం, లేదా అమ్మాయిల పేరుతో అబ్బాయిలు వల వేయడం చూశాం. కానీ, భార్య, భర్తలు పకడ్బంధీగా ప్లాన్ చేసి డబ్బుల కోసం ఓ యువకుడిని వేదింపులకు పాల్పడ్డారు లక్షలాది రూపాయాలను డిమాండ్ చేశారు

అయితే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను లక్ష్యంగా చేసుకొని భార్య, భర్తలు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే కొంత నగదును వారికి పంపాడు. అయితే లక్షలాది రూపాయాలు డిమాండ్ చేయడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెనక్కు తగ్గాడు.

ఛాటింగ్ ద్వారా డబ్బులు డిమాండ్

ఛాటింగ్ ద్వారా డబ్బులు డిమాండ్

మింగిల్ ఆన్‌లైన్ ద్వారా ఛాటింగ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రమాకాంత్‌‌కు ఓ వివాహిత ఆన్‌లైన్‌లో పరిచయమైంది అయితే ప్రతి రోజూ వీరిద్దరూ ఛాటింగ్ ద్వారా మాట్లాడుతకొనే వారు. అయితే ఆ వివాహిత తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తనకు నాలుగు లక్షలను ఇవ్వాలని రమాకాంత్‌ను కోరింది అయితే అంత డబ్బు లేదని మార్చి 9న, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆమెకు రూ.5లను ట్రాన్స్‌ఫర్ చేశాడు.

పదే పదే డబ్బులు డిమాండ్

పదే పదే డబ్బులు డిమాండ్

అయితే ఆ వివాహిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను పదే పదే డబ్బులు డిమాండ్ చేసినట్టుగా బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. దీంతో మార్చి 9, మరో పది వేల రూపాయాలను వివాహితకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రమాకాంత్ నుండి ఇంకా డబ్బులు లాగాలని వివాహిత, ఆమె భర్త ప్లాన్ చేశారు. మరోసారి లక్ష రూపాయాలు ఇవ్వాలని ఆమె కోరింది. దీంతో అంత డబ్బులను ఇవ్వలేనని బాధితుడు తేల్చి చెప్పాడు.

అప్పు ఇవ్వాలని ఒత్తిడి

అప్పు ఇవ్వాలని ఒత్తిడి

అయితే ఆన్‌లైన్ ఛాటింగ్ కాకుండా సెల్‌ఫోన్‌కు వివాహిత ఎస్ ఎం ఎస్ లను పంపిందని బాధితుడు చెప్పారు. అంతేకాదు తన భర్తతో కూడ లక్ష రూపాయాలను అప్పుగా ఇవ్వాలని మాట్లాడించింది. బాండ్ పేపర్లు తీసుకొస్తామని కూడ చెప్పారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోసారి ఛాటింగ్ ద్వారా ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది.

మేసేజ్‌లు బయటపెడతానని బెదిరింపులు

మేసేజ్‌లు బయటపెడతానని బెదిరింపులు

అయితే తన భార్యతో సాఫ్‌వేర్ ఇంజనీర్ రమాకాంత్ చేసిన ఛాటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని బట్టబయలు చేస్తానని వివాహిత భర్త రమాకాంత్‌ను బెదిరించాడని బాధితుడు చెబుతున్నారు. ఈ మేరకు తాను నివాసం ఉండే ఇంటికి వచ్చి మేసేజ్‌లు బయట పెట్టకుండా ఉండాలంటే తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు అయితే ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman befriended a techie on an online dating site. Her husband then blackmailed him, threatening to release the conversations that the techie had had with his wife and have his sister’s marriage cancelled if he did not give him money. The KPHB police arrested B. Satish on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X