హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోలార్ పవర్‌తో హైద్రాబాద్ మెట్రో, పైకప్పులలో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో నిర్మాణంలో ఉన్న మెట్రో రైలుకు దేశంలోనే తొలిసారి సోలార్ పవర్‌ను వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెట్రో రైలు కోసం నిర్మిస్తున్న మెట్రో రైలు స్టేషన్‌ల పైకప్పులలో సోలార్ ప్యానల్స్ ఉపయోగించాలని మెట్రో రైలు అధికారులు యోచిస్తున్నారు.

హైదరాబాద్ వంటి నగరాలలో సన్ లైట్ బాగుంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో సూర్య కిరణాలను ఉపయోగించాలని భావిస్తున్నారు. మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్టేషన్లను సోలార్ ప్యానల్స్ అమర్చేందుకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. స్టేషన్ల పైకప్పుల పైన సోలార్ ప్యానల్స్ అమర్చాలని భావిస్తున్నారు.

 Hyderabad Metro to be solar powered

ఈ సోలార్ పవర్‌ను నేరుగా రైళ్లకు ఉపయోగించాలా? లేక మెయిన్ గ్రిడ్‌కు పంపించి ఉపయోగించాలా? ఏదయితే బాగుంటుందనే విషయాన్ని మెట్రో అధికారులు చర్చిస్తున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. సోలార్ ప్యానల్స్ ఉపయోగించడం ద్వారా దాదాపు నలభై శాతం పవర్ ఆదా అవుతుందని భావిస్తున్నారు.

English summary
The Hyderabad Metro Rail could become the first Metro in the country to extensively use solar power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X