• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మెట్రో తొలిరోజే రికార్డ్: ప్రయాణికులతో కిటకిట, సెల్ఫీల హోరు(పిక్చర్స్)

|
  Hyd Metro : 1 Lakh People Travel On The First Day | Oneindia Telugu

  హైదరాబాద్: ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూసిన నగర ప్రజలు.. ప్రారంభమైన రోజు నుంచే మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపారు. బుధవారం రోజు మెటో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా మెట్రో ప్రారంభమైన విషయం తెలిసిందే.

  హైదరాబాద్ మెట్రో అద్భుతం, నేను నడపాల్సింది రైలును కాదు, దేశాన్ని: మోడీ, విరిసిన నవ్వులు

  హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలపై ఆందోళన: ఎన్వీఎస్ రెడ్డి వివరణ

  కాగా, బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో స్టేషన్లు, మెట్రోరైళ్లన్నీ ప్రయాణికులతో సందడిగా కనిపించాయి. మెట్రో కారిడార్‌ ప్రారంభ స్టేషన్లయిన నాగోల్‌, ఉప్పల్‌, మియాపూర్‌, అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లు రోజంతా ప్రయాణికుల ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేశారు.

  తొలి రోజే రికార్డ్

  కాగా, మెట్రోరైలు తొలిరోజే రికార్డు సృస్టించింది. అధికారుల అంచనాలను మించి తొలిరోజు ఏకంగా 2లక్షలకు మించి ప్రజలు మెట్రోలో ప్రయాణించారు. దేశంలో ఇప్పటివరకు వివిధ నగరాల్లో ప్రారంభమైన మెట్రోలో తొలిరోజు 50వేలకు మించి ప్రజలు ప్రయాణించలేదు. హైదరాబాద్‌ మెట్రోలో మాత్రం 2లక్షలకు పైగా ప్రయాణించడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రోలో తొలిరోజు లక్షమందికి పైగా ప్రయాణించారు. మెట్రోని నగరవాసులు పెద్ద ఎత్తున స్వాగతించడం ఆనందాన్ని కల్గించింది'అని మంత్రి కేటీఆర్‌ బుధవారం రాత్రి ట్వీట్‌ చేశారు.

   బారులు తీరిన జనం

  బారులు తీరిన జనం

  తొలి మెట్రో రైలు మియాపూర్‌ స్టేషన్‌ నుంచి ఉదయం 6గంటలకే బయలుదేరుతుందని తెలిసి పెద్దఎత్తున ప్రయాణికులు అక్కడికి వచ్చి కౌంటర్ల వద్ద బారులు తీరారు. తొలి టోకెన్‌ సొంతం చేసుకోవాలన్న ఆరాటం పలువురిలో కనిపించింది.

   తొలి టికెట్ ఆనందం

  తొలి టికెట్ ఆనందం

  నిజాంపేట రోడ్డుకు చెందిన వ్యాపారి రవికుమార్‌ తొలి టోకెన్‌ కొనుగోలు చేశారు. తొలిసారిగా మెట్రో స్మార్ట్‌కార్డును కేపీహెచ్‌బీకి చెందిన గుడివాడ చెంచయ్య వినియోగించారు. వీరిద్దరిని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ సిస్టమ్స్‌ సీవోవో అనిల్‌కుమార్‌ సైని అభినందించారు. సరిగ్గా ఆరు గంటల సమయంలో తొలి మెట్రోరైలు ప్రయాణికుల ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది.

   ఫొటోలు, సెల్ఫీల సందడి

  ఫొటోలు, సెల్ఫీల సందడి

  పలువురు కుటుంబసమేతంగా మొదటిసారి మెట్రో రైలులో అమీర్‌పేట వరకు ప్రయాణించారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకొని యువత తొలి మెట్రో ప్రయాణ అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

   చిన్నపాటి సమస్యలు

  చిన్నపాటి సమస్యలు

  మెట్రో తొలిరోజు కావడంతో చిన్నచిన్న సమస్యలు ఎదురవడంతో వాటిని చక్కదిద్దడానికి అధికారులు ప్రయత్నించారు. మన మెట్రో సగటు వేగం 33 కి.మీ. కాగా, ఆరంభం కావడంతో ఇంకా నెమ్మదిగానే పరుగులు తీశాయి.

   నెమ్మదిగా రైళ్లు..

  నెమ్మదిగా రైళ్లు..

  ప్రతిస్టేషన్‌లో సాధారణంగా 20 సెకన్లు మాత్రమే మెట్రో ఆగుతుంది. కానీ, చాలామంది మొదటిసారి ప్రయాణిస్తుండటం.. రద్దీ నేపథ్యంలో కొన్నిస్టేషన్లలో 2 నిమిషాల వరకు ఆగింది. దీంతో గమ్యస్థానం చేరేందుకు ఎక్కువ సమయం పట్టింది.

  మియాపూర్‌ నుంచి అమీర్‌పేటకు 22 నిమిషాలుగా అంచనా వేయగా 23 నిమిషాలు పట్టింది. నాగోల్‌ నుంచి అమీర్‌పేటకు 42 నిమిషాల్లో చేరుకోవాలి. కానీ 45 నిమిషాలు పట్టిందని మెట్రో అధికారులు తెలిపారు.

   కొందరికి నిరాశ

  కొందరికి నిరాశ

  మొదటి రైలులో ప్రయాణించాలనే ఎంతో ఆశతో మియాపూర్‌, నాగోల్‌ స్టేషన్లకు వచ్చిన ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రైలు ప్రయాణ సమయానికి పది నిమిషాల ముందు టోకెన్‌లిచ్చే కౌంటర్లు సేవలు ప్రారంభించాయి. వాళ్లతో సంబంధం లేకుండా టోకెన్‌ తీసుకుందామంటే అక్కడున్న టోకెన్‌ వెండింగ్‌ మిషిన్లు(టీవీఎం) పనిచేయలేదు. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే స్టేషన్‌కు చేరుకున్నా మొదటి రైలులో వెళ్లలేకపోయామంటూ చాలా మంది నిరాశపడ్డారు.

   జరిమానాలతో షాక్

  జరిమానాలతో షాక్

  మొదటి ట్రిప్పు నుంచే జరిమానాల వెల్లువ ప్రారంభమైంది. కొద్దిమంది ప్రయాణికులకు అవగాహన లేక టోకెన్లు తీసుకున్న స్టేషన్‌లో కాకుండా తరువాతి స్టేషన్లలో దిగారు. దీంతో స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లే దారి తెరుచుకోలేదు. ఈ రకంగా ఒక్కో ప్రయాణికుడు రూ.5 నుంచి రూ.10 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. బేగంపేట వరకు టోకెన్‌ తీసుకుని అమీర్‌పేటలో దిగానని, దీంతో రూ.5 జరిమానా కట్టాల్సి వచ్చిందని తార్నాకలో మెట్రో రైలు ఎక్కిన ఓ ప్రయాణికుడు తెలిపారు. అయితే, ‘మెట్రో కార్డు ఉన్నోళ్లు ఎక్కడైనా ఎక్కొచ్చు, దిగొచ్చు. టోకెన్‌ తీసుకుంటే మాత్రం గమ్యస్థానంలోనే దిగాలి. తరువాతి స్టేషన్‌లో దిగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది' అని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.

   తొలి ప్రయాణికుల ఆనందం

  తొలి ప్రయాణికుల ఆనందం

  మొదటి టికెట్ కొనుగోలు దారుడు రవికుమార్ మాట్లాడుతూ.. ‘మెరైలు తొలి టోకెన్‌ కొనుగోలు చేయడం సంతోషం కలిగించింది. మొదటి టోకెన్‌ సొంతం చేసుకోవాలని తెల్లవారుజామున మూడు గంటలకే మియాపూర్‌ స్టేషన్‌కు వచ్చా' అని తెలిపారు. కాగా, తొలి కార్డ్ ఉపయోగించిన మొదటి వ్యక్తి చెంచయ్య మాట్లాడుతూ.. ‘మూడు రోజుల క్రితం ఎస్‌ఆర్‌నగర్‌ మెట్రోస్టేషన్‌లో స్మార్ట్‌కార్డు కొనుగోలు చేశా. తొలిసారిగా మెట్రో స్మార్ట్‌కార్డును ఉపయోగించి మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు ప్రయాణించిన అనుభూతి జీవితంలో మరువలేను' అని ఆనందం వ్యక్తం చేశారు.

   చెప్పలేని అనుభూతి..

  చెప్పలేని అనుభూతి..

  మెట్రో రైల్‌ సిస్టమ్స్‌ సీవోవో అనిల్‌కుమార్‌సైనీ మాట్లాడుతూ.. ‘ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు నిర్మాణంలో పనిచేసిన నేను తొలిసారిగా ప్రయాణికులతో పాటే రైలులో వెళ్లడంచాలా సంతోషంగా ఉంది. చెప్పలేనిఅనుభూతిని కలిగించింది. కాలుష్య రహిత ప్రయాణంతో ప్రజలు తమ జీవన ప్రమాణాలు పెంచుకుంటారనడంలో సందేహం లేదు. మెట్రోతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది' అని వివరించారు.

  జాగ్రత్తగా ప్రయాణం

  ‘ప్రయాణికులు భారీగా తరలివస్తున్నారు. అందుకు తగినవిధంగా అధికారులు, పోలీసులు తగు ఏర్పాటు చేసుకోవాలి. ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి సహకరించాలి. మెట్రో మనకు గర్వకారణం. ప్రయాణికులు కూడా పిల్లలు, పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలి' అని కేటీఆర్ తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Approximately 1,00,000 people travelled on the metro rail on the first day of commercial operations. The huge response took the operators by surprise and they struggled to cope with the load.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more