వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus effect: మెట్రోలో తగ్గిన 10 వేల మంది ప్రయాణికులు, లాభాల మెట్రో కాస్త..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని.. కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు కోచ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని వివరించారు. రాత్రి సర్వీసు ముగిసిన తర్వాత.. ఆటో కెమికల్స్‌తో క్లీన్ చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రత, ఆరోగ్యం మెట్రోకు ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. దీనిపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్ రూమర్ల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్న ప్రయాణికులు మాత్రం విశ్వసించడం లేదన్నారు. కరోనా వైరస్ భయంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గిందని తెలిపారు. 10 వేల మంది వరకు మెట్రోలో రావడం లేదని చెప్పారు. వాస్తవానికి మెట్రో రైలు కోచ్‌లను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుతోన్న.. ప్యాసెంజర్స్ మాత్రం భయాందోళనకు గురవుతోన్నారని తెలిపారు. ఇదీ సంస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు.

hyderabad metro reduce 10 thousand passengers: metro md

వాస్తవానికి హైదరాబాద్ మెట్రో లాభాల్లో నడుస్తోంది. ఎక్కువమంది ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తోంది. ఎక్కువగా ఐటీ కంపెనీ ఉద్యోగులు ట్రావెల్ చేయడం, కనీస చార్జీ ఎక్కువే ఉండటంతో సంస్థకు మంచి లాభాలను ఆర్జించి పెడుతోంది. కానీ కరోనా వైరస్ వల్ల ఆ లాభాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. 10 వేల మంది ప్రయాణికులు తగ్గడం అంటే మాముల విషయం కాదు. అన్నీ చర్యలు తీసుకున్నామని చెబుతోన్న.. ప్రయాణికులు మాత్రం ట్రావెల్ చేసేందుకు ముందుకురావడం లేదు.

English summary
hyderabad metro reduce 10 thousand passengers metro md nvs reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X