• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మరో లవ్ జిహాద్: ప్రేమ.. సహజీవనం.. మోసం! మతం మారినా చివరికి.., మీడియాతో యువతి గోడు!

By Ramesh Babu
|

హైదరాబాద్: వాళ్లిద్దరూ ప్రొఫెషనల్స్. ఆ పరిచయం తరువాతి కాలంలో ప్రేమగా మారింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో స్వదేశంలో అయితే పెళ్లికి తన కుటుంబం ఒప్పుకోదని, దుబాయ్ వెళ్లి పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితం గడుపుదామని అబ్బాయి చెప్పాడు.

  Love Jihad : Let There Be Love

  ట్రైనీ నర్సుపై డాక్టర్ అఘాయిత్యం, జలుబు తగ్గుతుందంటూ మత్తు ఇంజక్షన్ ఇచ్చి..

  దీనికి అమ్మాయి కూడా ఒప్పుకుంది. ముందు ఉద్యోగం పేరుతో అతడు దుబాయి వెళ్లిపోయాడు. ఆ తరువాత అతడి ప్రియురాలు కూడా అక్కడికి చేరుకుంది. ఇద్దరూ కలిసి నాలుగేళ్ల సహజీవనం కూడా చేశారు. పెళ్లి కోసం ఆమె తన మతం కూడా మార్చుకుంది.

  భువనగిరి కేంద్రంగా అమ్మాయిలను ముగ్గులోకి దింపే హాట్ కాలింగ్ గ్యాంగ్!

  ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆమెకు ఖురాన్ చదవడం రాదని, తమ మత సంప్రదాయాలు కూడా తెలియవని అబ్బాయి కుటుంబీకులు పెళ్లికి అడ్డు చెప్పారు. ఆమెతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న అబ్బాయి కూడా తన కుటుంబీకులకే వంతపాడాడు. పెళ్లి చేసుకోవడం కుదరదన్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఎలాగైనా ఆమె పీడ వదిలించుకోవాలని అనుకున్నాడు.

  తన ప్రేయసిపై తానే దొంగతనం కేసు మోపాడు. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెను భారత్ పంపించేశారు. కేసు పెడదామని పోలీస్‌స్టేషన్‌కి వెళితే.. నిందితుడు ఇక్కడ లేడు కాబట్టి కేసు నమోదు చేయలేమని మల్కాజిగిరి పోలీసులు తొలుత అన్నా తరువాత ఆ మోసగాడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. మరో లవ్ జిహాద్‌ను తలపిస్తున్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే...

   సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం...

  సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం...

  హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో ఉన్న కృపా కాంప్లెక్స్‌కు చెందిన పింకీచంద(25) నాలుగేళ్ల క్రితం సోమాజిగూడలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అదే కంపెనీలో పాతబస్తీ దారుల్ షాఫాలోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన సఫ్దర్ అబ్బాస్ జైదీ(28) కూడా ఉద్యోగం చేస్తుండే వాడు.

  పరిచయం ప్రేమగా మారి...

  పరిచయం ప్రేమగా మారి...

  ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న పింకీచంద, అబ్బాస్ జైదీలకు ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇద్దరి మతాలు వేరైనా అది వారి ప్రేమకు అడ్డుకాలేదు. ఇద్దరూ తమ భావి జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు.

   దుబాయ్ వెళ్లి పెళ్లిచేసుకోవాలని...

  దుబాయ్ వెళ్లి పెళ్లిచేసుకోవాలని...

  ప్రేమ మైకంలో ముందు తెలియలేదుగానీ, ఆ తరువాత అబ్బాస్ జైదీకి విషయం అర్థమైంది. మరో మతానికి చెందిన పింకీచందను కోడలిగా తన కుటుంబీకులు అంగీకరించరని అతడు గ్రహించాడు. ఒకరోజు పింకీతో మనసు విప్ప మాట్లాడాడు. ఇక్కడైతే మన పెళ్లికి తనవాళ్లు అంగీకరించరని, దుబాయ్ వెళ్లిపోయి ఎవరికీ తెలియకుండా పెళ్లిచేసుకుందామని ప్రతిపాదించాడు.

   నాలుగేళ్లుగా సహజీవనం...

  నాలుగేళ్లుగా సహజీవనం...

  ప్రియుడు అబ్బాస్‌తోనే భావి జీవితాన్ని ఊహించుకున్న పింకీచందకు కూడా మారో మార్గం కనిపించలేదు. అతడి ప్రతిపాదనకు ఆమె అంగీకరించింది. దీంతో ముందుగా ఉద్యోగం పేరుతో అబ్బాస్ జైదీ దుబాయ్ వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు పింకీచంద కూడా అక్కడికే చేరుకుంది. దేశం కానీ దేశం, ఏ అడ్డూ లేని యవ్వనం.. ఇంకేముంది, సహజీవనం మొదలైంది. ఇలా నాలుగేళ్లు ఆనందంగా గడిచిపోయాయి.

   పింకీచంద కాస్తా ఫాతిమా జహ్రాగా...

  పింకీచంద కాస్తా ఫాతిమా జహ్రాగా...

  ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లికి ముందు దుబాయ్ నిబంధనల ప్రకారం మతం మార్చుకోవలసి ఉంటుందంటూ 2014 జూలై 20న పింకీచందకు మత మార్పిడి చేయించాడు అబ్బాస్. అప్పట్నించి పింకీచంద కాస్తా ఫాతిమా జహ్రాగా మారిపోయింది. 2017 ఏప్రిల్ 17న పెళ్లిచేసుకోవాలని ముహూర్తం నిర్ణయించుకున్నారు.

  తీరా పెళ్లి విషయానికొచ్చేసరికి...

  తీరా పెళ్లి విషయానికొచ్చేసరికి...

  తీరా పెళ్లి విషయానికొచ్చేసరికి అబ్బాస్ కుటుంబీకులు రంగ ప్రవేశం చేశారు. ఎంత మతం మార్చుకుని ఫాతిమా జహ్రాగా పేరు మార్చుకున్నా ఖురాన్ చదవడం రాదు, ముస్లిం మత సంప్రదాయాలు కూడా తెలియవు, అలాంటి పిల్లతో నీకు పెళ్లేంటి అంటూ అబ్బాస్ మనసు మార్చే ప్రయత్నం చేశారు. దీంతో అబ్బాస్ కూడా తన కుటుంబీకులకే వంతపాడాడు.

   మోసం చేసి, ఆపైన దొంగతనం నేరం మోపి...

  మోసం చేసి, ఆపైన దొంగతనం నేరం మోపి...

  ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని, నాలుగేళ్లు సహజీవనం కూడా చేసి.. చివరికి అబ్బాస్ జైదీ ప్లేటు ఫిరాయించడంతో పింకీచంద అలియస్ ఫాతిమా జహ్రా నిర్ఘాంతపోయింది. అబ్బాస్‌ను ఛీ కొట్టింది. ఆమె దుబాయ్ పోలీసులకు ఎక్కడ ఫిర్యాదు చేస్తుందోని భయపడిన అబ్బాస్ ముందుజాగ్రత్తగా ప్రియురాలిపై తనే ఫిర్యాదు చేశాడు. తన ల్యాప్‌టాప్‌తోపాటు ఇతర విలువైన వస్తువులు ఫాతిమా జహ్రా దొంగిలించిందంటూ ఫిర్యాదు చేశాడు.

   కేసు నమోదు చేసిన పోలీసులు...

  కేసు నమోదు చేసిన పోలీసులు...

  దీంతో దుబాయ్ పోలీసులు తనిఖీలు చేసి పింకీచంద వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని ఆమెను భారత్‌కు పంపించేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె తీవ్రంగా కుమిలిపోయింది. తన కుటుంబ సభ్యుల సహకారంతో అబ్బాస్ జైదీ చేసిన మోసంపై ఫిర్యాదు చేద్దామనుకుని మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దుబాయ్‌లో ఉన్న అబ్బాస్ జైదీపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 376, 417, 420 ప్రకారం కేసు నమోదు చేశారు.

   మీడియాతో గోడు వెళ్లబోసుకుని...

  మీడియాతో గోడు వెళ్లబోసుకుని...

  తనకు జరిగిన అన్యాయంపై పింకీచంద అలియాస్ ఫాతిమా జహ్రా హైదరాబాద్‌లో మీడియాతో తన గోడును వెళ్లబోసుకుంది. దుబాయ్‌‌లోనే తేల్చుకుందామనుకుంటే అబ్బాస్ జైదీ తనపై మోపిన దొంగతనం కేసు కారణంగా తనకు ఇమ్మిగ్రేషన్ దొరకడం లేదని, అందుకే ఇక్కడైనా అబ్బాస్‌పై కేసు నమోదు చేద్దామని తాను భావించానని, అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరింది.

  English summary
  An NRI man was booked by the Rachkonda Police in Hyderabad for cheating and raping a 25-year-old woman after promising to marry her. The victim has also alleged that the accused Safdar Abbas Zaidi converted her into Islam when they were in Dubai, saying it was a necessary step towards their marriage. According to the Malkajgiri Police, Zaidi, a resident of Darulshifa in Hyderabad, met the woman when working at a software company in the city. The two fell in love and got into a relationship when Zaidi shifted to Dubai and was joined later by the woman. "Both the families of the man and the woman also agreed to a marriage in April this year. However, a few months back, a rift broke out leading to the cancellation of the wedding," the chief inspector of the Malkajgiri police station told. The woman and her family now allege that the man cheated her just to convert her to Islam. The accused has been booked under Section 376, 417 and 420 of the IPC.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X