హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ ఆఫీస్ ధ్వంసం: ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్​ఎస్‌​యూఐ కార్యకర్తల దాడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఎస్ఎఫ్​ఐ కార్యాలయంపై శుక్రవారం రాత్రి ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు దాడి చేశారు. కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్ జోక్యం చేసుకోవడం లేదని నిరనసకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

దాదాపు 100 మంది కార్యకర్తలు వాయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. సిబ్బందిపై దాడి చేశారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఎస్ఎఫ్​ఐ కార్యకర్తల దాడిని నిరసిస్తూ... హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంపై ఎన్​ఎస్‌​యూఐ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్‌​కు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 Hyderabad: nsui activists attacks on sfi office at rtc cross roads for vandalising rahul office

రాహుల్ కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ దాడి, ధ్వంసం

కేరళ రాష్ట్రంలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధికారిక కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు కేరళ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ దాడిలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

"ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, నాయకుల బృందం వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంలోకి చొరబడి ధ్వంసం చేశారు. వారు కార్యాలయ సిబ్బందిపై, రాహుల్ గాంధీ సిబ్బందిపై కిరాతకంగా దాడి చేశారు. కారణం మాకు తెలియదు' అని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐకి తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు కార్యాలయాన్ని ధ్వంసం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని వేణుగోపాల్ ఆరోపించారు.

' ఈ దాడి పోలీసుల సమక్షంలో జరిగింది. ఇది సీపీఎం నాయకత్వం చేసిన స్పష్టమైన కుట్ర. గత 5 రోజులుగా, ఈడీ రాహుల్‌ను ప్రశ్నిస్తోంది. కేరళ సీపీఎం.. నరేంద్ర మోడీ దారిలో ఎందుకు వెళుతుందో నాకు తెలియదు. సీతారాం ఏచూరి అవసరమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను' అని కేసీ వేణుగోపాల్ అన్నారు.

English summary
Hyderabad: nsui activists attacks on sfi office at rtc cross roads for vandalising rahul office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X