చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టార్ హోటల్స్‌లో ఉంటూ, ఆభరణాలు తెప్పించుకొని దోపిడీ: లగ్జరీ దొంగ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్టార్ హోటల్స్‌లో విడిది చేస్తూ లగ్జరీ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని నార్త్ జోన్ పోలీసుల మంగళవారం నాడు అరెస్టు చేశారు. నిందితుడిని అండమాన్‌కు చెందిన రావ్‌గా గుర్తించారు. అండమాన్ నుంచి వచ్చి స్టార్ హోటల్స్‌లో మకాం వేస్తూ ప్రముఖ జ్యువెల్లరీ షాపులకు ఫోన్ చేసి ఆభరణాలు కొంటానని బుకాయించి వారిని బోల్తా కొట్టిస్తాడు.

అభరణాలు తీసుకొని తాను ఉంటున్న స్టార్ హోటల్‌కు రావాలని చెబుతాడు. వారు ఆభరణాలు తీసుకు వచ్చాక బోల్తా కొట్టించి, వాటిని దోచుకుంటాడు. ఇలా స్టార్ హోటళ్లలో ఉంటూ పలు నగరాల్లో లగ్జరీగా దొంగతనాలకు పాల్పడ్డాడు.

 Hyderabad police arrest Luxury thief on Tuesday

నిందితుడు రావ్ నగరంలోని పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లలో దిగుతాడని, పెద్ద బ్యాగ్ ఒకటి, చిన్న బ్యాగ్ ఒకటి తన వెంట ఉంచుకుంటాడని పోలీసులు తెలిపారు. తనను తాను నేవీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుంటాడని, హోటల్ యాజమాన్యం ఒరిజినల్ ఆధార్ కార్డ్ కాకుండా జిరాక్స్ అడుగుతుందని, దానిని చూపించి దిగుతాడన్నారు.

నిందితుడు రావ్ ఇప్పటి వరకు 35 నగరాల్లో చోరీలకు పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు. చెన్నై, పుణే, ఢిల్లీ, లక్నో వంటి నగరాల్లో దొంగతనాలు చేశాడని తెలిపారు. కొన్నాళ్ల క్రితం అండమాన్‌లో ఓ యువతిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన కేసులో రావ్ నిందితుడు అని తెలిపారు.

English summary
Hyderabad North Zone police arrest Andaman's Luxury thief Rao on Tuesday. He theft in Pune, Chennai and other main cities also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X