హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సుధీర్' హత్య వెనుక ఇదీ అసలు కారణం: ఆ ఇద్దరిని పట్టుకున్నారు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి సుధీర్ హత్య కేసు మిస్టరీ వీడింది. కేసులో మిగిలిన ఇద్దరు నిందితులను కూకట్‌పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హత్య వెనుక కోణాలను వెల్లడించారు. సుధీర్ తో ఇటీవల జరిగిన గొడవే హత్యకు ప్రధాన కారణమని తేల్చారు.

Recommended Video

కూకట్‌పల్లి హత్య వెనుక అసలు కారణాలు? ఎవరీ సుధీర్?
హత్యకు దారితీసిన పరిస్థితులు..:

హత్యకు దారితీసిన పరిస్థితులు..:

మూసాపేట్‌కి చెందిన ఎలగల సుధీర్‌ ఈ నెల 9న
స్థానిక యువకులైన కొంతమందితో ఘర్ణణ పడ్డాడు. సభ్యత గ్రౌండ్‌లో జరిగిన ఈ గొడవ విషయం నవీన్ అనే యువకుడికి తెలిసింది. దీంతో తమ స్నేహితులను ఎందుకు కొట్టావంటూ అతను సుధీర్ వద్దకు వెళ్లి నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

ప్రసాద్ దాడి.. ప్రతీకారంతో రగిలిన నవీన్..:

ప్రసాద్ దాడి.. ప్రతీకారంతో రగిలిన నవీన్..:

నవీన్ తనతో గొడవ పడ్డ విషయాన్ని సుధీర్.. తన అన్న ప్రసాద్‌కు చెప్పాడు. తమ్ముడు ఆ విషయం చెప్పిన రోజే.. ప్రసాద్ నవీన్ ఉండే బస్తీకి వెళ్లి అతనిపై దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన నవీన్ స్నేహితులు జిల్లా మహేశ్, తేజలపై కూడా దాడి చేశాడు. ప్రసాద్ తమపై దాడి చేయడంతో సుధీర్ పై వారు కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.

ఇలా ప్లాన్..:

ఇలా ప్లాన్..:

సుధీర్ పై పగతో రగిలిపోయిన నవీన్.. అతన్ని హత్య చేయడానికే నిర్ణయించుకున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 10న కూకట్‌పల్లి శివానంద పునరావాస కేంద్రం ముందు రూ. 450లకు రెండు కత్తులను కొన్నాడు. ఆపై స్నేహితుడు తేజకు చెందిన హోండా ఆక్టీవా (టీఎస్08 ఎప్‌ఈ 4133)లో వాటిని పెట్టాడు. ముందస్తు ప్లాన్ లో భాగంగా.. ఈ నెల 12న సుధీర్‌పై దాడి చేయాలని నవీన్, తేజ, మహేశ్ లు నిశ్చయించుకున్నారు.

12న హత్య..:

12న హత్య..:

సుధీర్ కదలికలను తెలుసుకునేందుకు అతని ఇంటి పక్కనే ఉండే బైరెడ్ల శివ(21)తో టచ్ లో ఉన్నాడు నవీన్. 12వ తేదీ ఉదయం సుధీర్ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే శివ నవీన్ కు సమాచారం అందించాడు. శివ ఇచ్చిన సమాచారంతో కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ ఎదురుగా సుధీర్ బైక్ ను అడ్డుకున్న నవీన్&గ్యాంగ్.. జాతీయ రహదారిపై అతన్ని హతమార్చారు.

ఆ ఇద్దరిని అక్కడ పట్టుకున్నారు:

ఆ ఇద్దరిని అక్కడ పట్టుకున్నారు:

హత్యలో పాల్గొన్న బాయిపేట నవీన్(19)ను స్పాట్‌లోనే అదుపులోకి తీసుకోగా.. మిగతా ముగ్గురు పరారయ్యారు. నవీన్ ఇచ్చిన సమాచారంతో ఇటీవలే జిల్లా మహేశ్, శివలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హత్యతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు కొర్రె తేజోరావు(20), ఇప్పలి కృష్ణ(21)లను సోమవారం హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ వద్ద కూకట్‌పల్లి పోలీసులు అదుపులో తీసుకున్నారు. సుధీర్, అతని అన్న ప్రసాద్‌లతో తమకు ప్రాణ హాని ఉందని భావించామని, అందుకే హత్య చేశామని నిందితులు వెల్లడించినట్టుగా పోలీసులు తెలిపారు.

English summary
Days after an Intermediate student, Sudheer Erragalla, was hacked to death in broad daylight in a bustling area of Hyderabad, the city police arrested two more persons in connection with the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X