హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ లోటు తీర్చిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్: 4000 మంది కానిస్టేబుళ్లతో: పుట్టినరోజు, పెళ్లిరోజు గ్రీట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌లో వేలాది మంది పోలీస్ కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో ఉంటున్నారు. భార్యా, పిల్లలను, కుటుంబాలను వదిలేసి రోజంతా రోడ్ల మీద గడుపుతున్నారు. ఇంటికి వెళ్లినా..పిల్లలను ఆప్యాయంగా దగ్గరికి చేర్చుకోలేని పరిస్థితి వారిది. ఈ క్రమంలోనే వందలాది మంది పోలీసులు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల వంటి సంతోషకర సందర్భాల్లో రోడ్ల మీదే ఉంటున్నారు.

శానిటైజర్ తాగేసిన అనంతపురం జిల్లా వైద్యాధికారి: మంచినీళ్లు అనుకుని: ఆత్మహత్య అంటూ అనుమానాలు

దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అరుదైన నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలో లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లతో సంభాషించారు. పుట్టినరోజు, పెళ్లిరోజును జరుపుకొంటున్న వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ఉత్సాహాన్ని నింపారు. లాక్‌డౌన్ డ్యూటీల్లో ఉంటోన్న పోలీస్ కానిస్టేబుళ్ల సేవలను కొనియాడారు. వారంతా కరోనా వైరస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటూ అభినందించారు.

Hyderabad Police Commissioner Anjani Kumar interact with 4000 police personnel

దీనికోసం ఆయన ఉదయం తన కార్యాలయంలో ప్రత్యేకంగా వీడియో కార్ఫరెన్స్‌ను నిర్వహించారు. పలువురు డీసీపీలు, ఏసీపీలు ఇందులో పాల్గొన్నారు. యుద్ధం వంటి వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అంజనీ కుమార్ సూచించారు. మానిసక దృఢత్వాన్ని కూడబెట్టుకోవాలని అన్నారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని కోరారు.

ఎవరిదైనా పుట్టినరోజు, పెళ్లిరోజు ఉందా అని అడిగి మరీ తెలుసుకున్నారు. వారికి చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పోలీసు కానిస్టేబుళ్లు అప్రమత్తంగా ఉంటేనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులను నియంత్రించగలుగుతామని అన్నారు. కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోందని, ఇందులో పోలీసులు ప్రధానపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఇందులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Telangana: Hyderabad Police Commissioner Anjani Kumar held an interactive session with 4000 police personnel through video conferencing; extended birthday and anniversary wishes to some officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X