హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Big News : హైదరాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్‌(56)కి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆ కానిస్టేబుల్... గత 4 రోజులుగా నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్నాడు. దీంతో ఆయనతో పాటు కలిసి పనిచేసిన 12 మంది పోలీసులను కూడా క్వారెంటైన్‌కు తరలించారు.

కొద్దిరోజులుగా పొడి దగ్గుతో బాధపడుతున్న అతన్ని పోలీస్ ఉన్నతాధికారులు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ అతని బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షంచగా కోవిడ్ 19 పాజిటివ్‌గా తేల్చారు. దీంతో వెంటనే అతన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మల్లేపల్లిలోని బడీ మసీదు వద్ద ఇటీవల అతను ఓ వ్యక్తిని కలిసినట్టు సమాచారం. ఆ వ్యక్తి నిజాముద్దీన్ మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు.

Hyderabad Police head constable tests positive for COVID-19

కానిస్టేబుల్‌కి పాజిటివ్‌గా తేలడంతో.. పంజాగుట్టలోని అతని ఇంటికి మెడికల్ హెల్త్ & జీహెచ్ఎంసీ సిబ్బంది వెళ్లారు. అతనితో సన్నిహితంగా మెలిగిన ఏడుగురిని గుర్తించి ఐసోలేషన్ వార్డులకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Recommended Video

US Seeks India Help: Trump Open Request To PM Modi | Oneindia Telugu

తెలంగాణలో ఇప్పటివరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11 మంది మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా మొత్తం 4778 కేసులు నమోదవగా.. 136 మంది మృత్యువాతపడ్డారు.

English summary
Although COVID-19 is already showing its impact in Telangana State, on Monday a police head constable working with Hyderabad police too got infected with the dreaded virus. Dozens of fellow policemen are being sent for quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X