హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాంకర్ ప్రదీప్‌ను వదిలేయమన్న యువతికి దిమ్మతిరిగే షాకిచ్చిన హైదరాబాద్ పోలీస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డిసెంబర్ 31వ తేదీన మోతాదుకు మించి మద్యం మత్తులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడం లేదు. ఆయన పోలీసులకు చిక్కడం లేదు. అయితే, సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులు పెట్టిన ఒక పోస్టుకి ఓ అమ్మాయి ప్రదీప్‌ను వదిలేయమని చెప్పింది.

Recommended Video

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : యాంకర్ ప్రదీప్‌కు శిక్ష తప్పదా ?

దీనికి హైదరాబాదు పోలీసులు అదిరిపోయే సమాధానం చెప్పారు. న్యూఇయర్ సందర్భంగా 1683 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిజిస్టర్ అయ్యాయని హైదరాబాద్ పోలీసులు పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు హానీ భవాని అనే అమ్మాయి ఓ విజ్ఞప్తి చేసింది.

 యాంకర్ ప్రదీప్ డుమ్మా: ఫోన్ స్విచ్చాఫ్, ఇంటికెళ్తే.., పరారీలో ఉన్నారా? యాంకర్ ప్రదీప్ డుమ్మా: ఫోన్ స్విచ్చాఫ్, ఇంటికెళ్తే.., పరారీలో ఉన్నారా?

మా ప్రదీప్‌ను వదిలేయమంటే గట్టి కౌంటర్

మా ప్రదీప్‌ను వదిలేయమంటే గట్టి కౌంటర్

సార్, ప్లీజ్ మా యాంకర్ ప్రదీప్‌ను వదిలేయండి, పాపం చిన్నపిల్లవాడు, తెలియక చేశాడని ఆమె విజ్ఞప్తి చేసింది. దానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గట్టి సమాధానం చెప్పారు. ఎవరినీ అగౌరవపరచవద్దని, చిన్నపిల్లలు అయితే పాలు తాగి పడుకోవాలి కాని, మందు తాగి నడపడం కరెక్టు కాదు కదా, సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని, అడ్మిన్ హెచ్ పేరుతో సమాధానం ఇచ్చారు.

అంతుబట్టని ప్రదీప్ వ్యవహారం

అంతుబట్టని ప్రదీప్ వ్యవహారం

ఇదిలా ఉండగా, యాంకర్ ప్రదీప్ వ్యవహారం అంతుబట్టడం లేదు. కౌన్సెలింగ్‌కు ఆయన హాజరు కాలేదు. మంగళవారం కౌన్సెలింగ్ కేంద్రానికి రావాలని ట్రాఫిక్ పోలీసులు ఆయనను ఆదేశించారు. మంగళ, బుధ వారాలు ఎదురు చూశారు. రాలేదు. గురువారం కూడా అదే పరిస్థితి.

వరుసగా డుమ్మాలు

వరుసగా డుమ్మాలు

ప్రదీప్ శుక్రవారం కూడా కౌన్సెలింగ్‌కు హాజరు కాకుంటే ఛార్జీషీట్ దాఖలు చేసి వారెంట్ జారీ చేయనున్నారు. ప్రదీప్‌ను కోర్టులో ప్రవేశ పెడతారు. కోర్టు కూడా కౌన్సెలింగ్ ఇవ్వమని చెబుతుందని అంటున్నారు. అసలు ప్రదీప్ వస్తాడా, రాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఫాంహౌస్‌లో ప్రదీప్

ఫాంహౌస్‌లో ప్రదీప్

ప్రదీప్ ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఓ ప్రముఖ వ్యక్తి ద్వారా బయటపడేందుకు చూస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతని కోసం ఇంట్లో, కార్యాలయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను మణికొండలోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నట్లు గుర్తించారని సమాచారం.

‘ముందస్తు'కే కేసీఆర్ మొగ్గు! ముఖ్యనేతలు, కీలక అధికారులతో సమాలోచనలు!‘ముందస్తు'కే కేసీఆర్ మొగ్గు! ముఖ్యనేతలు, కీలక అధికారులతో సమాలోచనలు!

English summary
Greater Hyderabad Traffic Police shocking reply to anchor Pradeep fan in social media, who asked for leave Pradeep for this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X