హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిపూర్ణానంద ఆగ్రహం: మహేష్ కత్తికి పోలీసుల షాక్, నగర బహిష్కరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

హైదరాబాద్ నుంచి కత్తి మహేష్ బహిష్కరణ

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో హైలెట్ అయిన మహేష్ కత్తి.. హిందూ దేవతలపై కూడా దారుణపదజాలం వినియోగించారు. ఇష్టారీతిన మాట్లాడి భావప్రకటన స్వేచ్ఛ అంటూ ముడిపెట్టే మహేష్ కత్తిపై హైదరాబాద్ నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు.

అతనిపై నగర బహిష్కరణ వేటు వేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని అతనికి హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

మహేష్ కత్తి వ్యాఖ్యలు: తెలుగు సీఎంలకు పరిపూర్ణానంద అల్టిమేటంమహేష్ కత్తి వ్యాఖ్యలు: తెలుగు సీఎంలకు పరిపూర్ణానంద అల్టిమేటం

అదుపులోకి తీసుకొని చిత్తూరుకు తరలింపు

అదుపులోకి తీసుకొని చిత్తూరుకు తరలింపు

వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాదులోని కత్తి మహేష్‌కు నోటీసులు ఇచ్చారు. నగరం విడిచి వెళ్లాలని, అనుమతి లేకుండా ప్రవేశించవద్దని చెప్పారు. అతనిని అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా. పోలీసులు అక్కడకి తరలించారు.

పరిపూర్ణానందస్వామి అల్టిమేటం

పరిపూర్ణానందస్వామి అల్టిమేటం

మహేష్ కత్తి హిందూ దేవతలను విమర్శించడంపై హిందూ సంఘాలు, హిందువులు, స్వామీజీలు, నాగబాబు వంటి సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. రాముడిపై అతనిది ఉన్మాదపు భావజాలమని, అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర సంకల్పించారు. చర్యలు తీసుకోకుంటే యాదాద్రిలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు.

పరిపూర్ణానంద హౌస్ అరెస్టు

పరిపూర్ణానంద హౌస్ అరెస్టు

మరోవైపు, పరిపూర్ణానంద స్వామి బషీర్‌బాగ్‌లోని భాగ్యలక్ష్మి గుడిలో శ్రీరాముడికి పూజలు చేసి, ఉప్పల్ వరకు నడిచి ఆ తర్వాత అక్కడి నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్రగా సిద్ధమయ్యారు. అయితే పరిపూర్ణానందను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. స్వామీజీ బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. స్వామీజీని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ ప్రకటించారు. స్వామీజీ చేస్తున్న ధర్మాగ్రహ యాత్రకు పోలీసుల అనుమతి లేదని తెలిపారు. కాగా, స్వామీజీ పిలుపుకు వేలాదిమంది హిందువులు తరలి వచ్చారు.

పరిపూర్ణానంద అల్టిమేటం, కత్తి నగర బహిష్కరణ

పరిపూర్ణానంద అల్టిమేటం, కత్తి నగర బహిష్కరణ

పరిపూర్ణానందకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ కారణంగానే ఆయన పిలుపునివ్వడంతో వేలాది మంది తరలి వచ్చారు. పరిపూర్ణానంద అల్టిమేటం, హిందువుల ఆగ్రహం నేపథ్యంలో మహేష్ కత్తిపై చర్యలు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. కానీ అంత దారుణపదజాలం వాడిని అతనిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలనేది డిమాండ్. మహేష్ కత్తి నగర బహిష్కరణ కేవలం ఉపశమనం మాత్రమేనని అంటున్నారు.

English summary
Hyderabad City police on Monday expelled controversial Mahesh Kathi from city. Mahesh Kathi is targetting Hindu gods and Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X