హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ మండిపోతోంది: ఈ సీజన్‌లో గరిష్ట ఉష్ణోగ్రత, రెండు రోజులు వేడిగాలులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎండ వేడిమితో హైదరాబాదు నగరం మండిపోతోంది. ఈ వారాంతానికి హైదరాబాదులో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గరిష్ట ఉష్ణోగ్రత 39.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మార్చిలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత కన్నా మూడు ఢిగ్రీలు అధికంగా నమోదైంది.

పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చునని హైదరాబాదు వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు అంటున్నారు. మరో రెండు రోజులు వేడిగాలులు వీస్తాయని హచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 1,2 తేదీల్లో వేడిగాలులు విపరీతంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Hyderabad records season’s hottest day

హైదరాబాదులోని కుత్బుల్లాపూర్, పాశమైలారం, మోండా మార్కెట్, బండ్లగుడ ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో గురువారంనాడు 40 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైంది.

తెలంగాణ జిల్లాల్లో వేడిగాలుల తీవ్ర ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాదులో గత పది రోజుల నుంచి తీవ్రంగా ఉష్ణోగ్రత పెరిగాయి.

English summary
Hyderabad temperature may breach the 40-degree-Celsius mark by weekend, Met officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X