హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతిపై 3రోజులపాటు రేప్: పీఎస్ వద్ద మద్యం తాగుతూ రౌడీ షీటర్ వీరంగం

|
Google Oneindia TeluguNews

Recommended Video

హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్

హైదరాబాద్: యువతిపై మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన రౌడీ షీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు శుక్రవారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన ఆ రౌడీ షీటర్ పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశాడు. మూడు గంటలపాటు ముప్పు తిప్పలు పెట్టాడు.

రౌడీ షీటర్ ఘాతుకం: తల్లి ముందే కూతురుపై అత్యాచారం, మూడు రోజులుగా..రౌడీ షీటర్ ఘాతుకం: తల్లి ముందే కూతురుపై అత్యాచారం, మూడు రోజులుగా..

 యువతిపై 3రోజులపాటు

యువతిపై 3రోజులపాటు

ఏసీపీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన రౌడీ షీటర్ షేక్ అమీర్(26)కు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంగన్ వాడీ కేంద్రంలో పనిచేస్తున్న.. తన ఇంటికి సమీపంలో ఉండే యువతి ఇంట్లో చొరబడిన అమీర్.. ఆమెపై మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.

భయంతో బాధితురాలు

భయంతో బాధితురాలు

కాగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి తల్లిని తీవ్రంగా కొట్టాడు. అతనికి భయపడి ఇంట్లోనే కుమిలిపోతున్న బాధితురాలికి స్థానికులు ధైర్యం చెప్పి, గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పీఎస్‌కు మద్యం తాగుతూ వచ్చి..

పీఎస్‌కు మద్యం తాగుతూ వచ్చి..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అమీర్ పరారీలో ఉండటంతో అతని బావను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అమీర్.. పూటుగా మద్యం సేవించి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. చేతిలో గ్లాసు పట్టుకుని మద్యం తాగుతూ.. పోలీసులను దుర్భాషలాడాడు.

గొంతుకోసుకుంటానంటూ.. ఎట్టకేలకు

గొంతుకోసుకుంటానంటూ.. ఎట్టకేలకు

అంతేగాక, బ్లేడుతో చేయి కోసుకున్నాడు. తనను అరెస్ట్ చేస్తే గొంతు కోసుకుంటానని బెదిరింపులకు దిగారు. మూడు గంటలపాటు ముప్పుతిప్పలు పెట్టిన అమీర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించిన అనంతరం అతడ్ని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

English summary
The Chilkalguda police arrested a history-sheeter on charges of raping a 19-year-old girl on Friday. He is alleged to have confined the girl in her house and sexually exploited her for three days, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X