వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన అవకాశం: పోస్టల్ స్టాంపులపై హైద్రాబాద్ బిర్యానీ, తిరుపతి లడ్డు

హైద్రాబాద్ బిర్యానీ అంటే తెలియని వారుండరు. ఈ బిర్యానీ అంటే దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందింది. హైద్రాబాద్‌కు వచ్చినవారెవరూ కూడ ఈ బిర్యానీ తినకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

పోస్టల్ స్టాంపులపై హైద్రాబాద్ బిర్యానీ, తిరుపతి లడ్డు, ఇడ్లీ, దోశ

హైదరాబాద్: హైద్రాబాద్ బిర్యానీ అంటే తెలియని వారుండరు. ఈ బిర్యానీ అంటే దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందింది. హైద్రాబాద్‌కు వచ్చినవారెవరూ కూడ ఈ బిర్యానీ తినకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ బిర్యానీ మరో అరుదైన ఘనతను దక్కించుకొంది. బిర్యానీ ఇండియా స్టాంప్‌లపై దర్శనమివ్వనున్నాయి.

హైద్రాబాద్ బిర్యానీ రుచి ఇతర బిర్యానీలకు ఉండదనే ప్రచారం కూడ ఉంది.ఈ బిర్యానీ రుచి చూసేందుకు తాపత్రయ పడుతుంటారు. విదేశీయులే కాదు ఇండియాలోని పలు రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు కూడ ఈ బిర్యానీ రుచి చూసేందుకే హైద్రాబాద్‌కు వచ్చేవారు కడూ లేకపోలేదు.

ఏళ్ళ తరబడి ఈ బిర్యానీ తయారీ హైద్రాబాద్‌లో సాగుతోంది. ఈ బిర్యానీ తయారీ విధానం డిఫరెంట్‌గా ఉంటుందని చెబుతారు నిపుణులు. అయితే బిర్యానీ పేరు మీదనే హైద్రాబాద్‌లో హోటళ్ళు వెలిశాయి.

ఇండియా పోస్టల్ స్టాంపులపై బిర్యానీ

ఇండియా పోస్టల్ స్టాంపులపై బిర్యానీ

నోరూరించే హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. హైదరాబాద్ బిర్యానీ ఇక నుండి ఇండియన్ పోస్టల్ స్టాంపులపై దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు భారత పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా 24 వంటకాలతో పోస్టల్ స్టాంపు ఫొటోలను గత శుక్రవారం విడుదలచేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు వంటకాలకు స్థానం కల్పించింది. ఇందులో హైద్రాబాద్‌కు చెందిన బిర్యానీకి స్థానం దక్కింది.

 హైద్రాబాద్ బిర్యానీ ఇలా..

హైద్రాబాద్ బిర్యానీ ఇలా..

హైదరాబాద్ బిర్యానీకి స్థానం కల్పించడంలో ప్రత్యేకత ఉంది. కుతుబ్‌షాహీ సామ్రాజ్యస్థాపన, గోల్కొండ కోట నిర్మాణానికి మరో రెండునెలల్లో 500 ఏండ్లు పూర్తవుతాయి. 500వ వార్షికోత్సవం సందర్భంగా కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలకు ఇష్టమైన రాయల్ వంటకంగా భావించే బిర్యానీని గౌరవిస్తూ పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. బిర్యానీ అంటే పర్షియన్ భాషలో వేయించిన ఉల్లి. బిర్యానీని ఉత్తరభారత్‌కు పరిచయం చేసిన ఘనత మొఘల్ చక్రవర్తి బాబర్‌కు దక్కుతుంది. ఇరాన్ (పర్షియా)కు చెందిన కుతుబ్‌షాహీలు అక్కడి ఆహార సంప్రదాయాలను దక్షిణ భారత్‌కు తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన అసఫ్‌జాహీలు మొఘల్, పర్షియన్ విధానాల కలబోతతో హైదరాబాదీ ప్రత్యేక వంటకాలకు నాంది పలికారు అని ప్రముఖ చరిత్రకారుడు, హైదరాబాద్ వంటకాలపై పరిశోధనచేస్తున్న డాక్టర్ మహ్మద్ సూఫిల్లా చెప్పారు.

 తిరుపతి లడ్డూకు కూడ స్థానం

తిరుపతి లడ్డూకు కూడ స్థానం

ఇండియన్ పోస్టల్ స్టాంపులపై తిరుపతి లడ్డూకు కూడ స్థానం దక్కింది. తిరుపతికి భక్తులు వెళ్తుంటారు. అయితే తిరుపతి లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ లడ్డూ రుచి ఇతర లడ్డూల రుచికి భిన్నంగా ఉంటుంది. తిరుపతికి వెళ్తే లడ్డూలు తీసుకోవాల్సిందే. ప్రతి రోజూ లక్షలాది లడ్డూలను భక్తుల కోసం టిటిడి తయారు చేయిస్తోంది.

 ఇడ్లీ, దోశలకు కూడ

ఇడ్లీ, దోశలకు కూడ

ఇండియాలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వంటకాలకు కూడ ఇండియన్ స్టాంపులపై దర్శనమివ్వనున్నాయి. ఇడ్లీ, దోశ, పొంగల్‌కు కూడ స్టాంపులపై ముద్రించనున్నట్టు ఇండియన్ పోస్టల్ శాఖ ప్రకటించింది. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ప్రముఖమైన వంటకాలను గుర్తించి వాటిని స్టాంపులపై ముద్రించారు.

English summary
The aroma of Hyderabad's trademark cuisine biryani, baghare baingan and seviyan -may 'waft' through the air the next time you receive a mail from the India Post. These three signature dishes of Hyderabad have made their way into India postage, with the Department of Post on Friday issuing stamps with photos of these dishes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X