హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ విద్యార్థిని ఘనత: మైక్రోసాఫ్ట్‌లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో జాబ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మైక్రోసాఫ్ట్ ప్రధానా కార్యాలయంలో భారీ వేతనంతో ఉద్యోగం పొంది సత్తా చాటారు. అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ నగరానికి చెందిన దీప్తికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది.

ఆమె వేతనం ఏడాదికి రూ. 2 కోట్లు అందుకోనున్నారు. యూనివర్సిటీ ఫ్లోరిడాలో మే 2న ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి చేసిన దీప్తి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు. మే 17న ఆమె ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Hyderabad student gets job in Microsoft with annual salary Rs 2cr

బీటెక్ తర్వాత జేపీ మోర్గాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరిన దీప్తి.. మూడేళ్లు అక్కడ పనిచేశాక రాజీనామా చేసి ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో దీప్తికి అత్యధిక వేతనం లభించడం విశేషం.

Recommended Video

SRH పై మళ్ళీ గుర్రుమన్న ఫ్యాన్స్.. No IPL బట్ చివాట్లు మాత్రం కామన్!! || Oneindia Telugu

కాగా, దీప్తి తండ్రి డాక్టర్ వెంకన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో క్లూస్ టీం విభాగాధిపతిగా ఉన్నారు. దీప్తికి మైక్రోసాఫ్ట్‌లో భారీ వేతనంతో ఉద్యోగం రావడంతో ఆమెతోపాటు కుటుంబసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Hyderabad student gets job in Microsoft with annual sarary Rs 2cr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X