వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ నోట్లు చలామణి చేస్తూ విధ్యార్థిలిలా, కమీషన్ కోసమేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు వేల రూపాయాల నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తోన్న ఇద్దరు ఇంజనీరింగ్ విధ్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.కాలేజీ క్యాంటీన్ లో నకిలీ నోట్లను చలామణిచేస్తుండగా క్యాంటీన్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

బోయిన్ పల్లికి చెందిన బంగారు నగల వ్యాపారి విజయ్ శర్మ, అతని స్నేహితుడు మోతేశ్యామ్ అలీఖాన్ లు నకిలీ రెండు వేల రూపాయాలను తయారు చేశారు.

విజయ్ శర్మ కలర్ ప్రింటర్ కమ్ స్కానర్ ను ,ఫోటో కాపీయర్ ను కొనుగోలు చేశారు. వీటి సహయంతో ఆయన నకిలీ రెండు వేల రూపాయాలను తయారు చేయడం ప్రారంభించాడు.

రూ.35 లక్షల రూపాయాల నకిలీ రెండు వేల రూపాయాల నగదును వాజీదుద్దీఖాన్, అబ్దుల్ సమద్ అనే ఇద్దరు విధ్యార్థుల సహయంతో ఈ నోట్లను చలామణి చేశారు. వాజీదుద్దీన్, అబ్దుల్ సమద్ లు లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు.

నకిలీ నోట్లను చలామణి బహిరంగ మార్కెట్లో చలామణి చేస్తే అనుమానం వస్తోందని భావించి ఇంజనీరింగ్ విధ్యార్థుల ద్వారా ఈ నోట్లను చలామణి చేయాలని భావించారు. ఈ మేరకు ఇద్దరు విధ్యార్థుల ద్వారా ఈ నోట్లను చలామణి చేశారు.

Hyderabad: Tech students arrested in ‘printed’ Rs 2,000 note scam

వాజీదుద్దీఖాన్, అబ్దుల్ సమద్ లు లార్డ్స్ కాలేజీలో ఈ నకిలీ నోట్లను చలామణి చేసేవారు. కాలేజీ క్యాంటీన్ లో ఈ నోట్లను విజయవంతంగా రెండు దఫాలు చలామణి చేశారు.

మూడో దఫా కూడ ఈ విధ్యార్థులు కాలేజీ క్యాంటీన్ లో నకిలీ రెండు వేల రూపాయాలను చలామణి చేసేందుకు ప్రయత్నించారు.అయితే క్యాంటీన్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఇద్దరు విధ్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నకిలీ నోట్ల తయారీ వ్యవహరం వెలుగుచూసింది. సుమారు 20.76 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను మోతేశ్యామ్ నుండి ,రూ.12.18 లక్షల నకిలీ నగదును విజయ్ నుండి, రూ.లక్ష రూపాయాలను వాజీదుద్దీన్ నుండి,రూజ1.02 లక్షలు సమద్ నుండి స్వాధీనం చేసుకొన్నారు.

రూ. లక్ష రూపాయాల నకిలీ కరెన్సీని చలామణి చేస్తే పదివేల రూపాయాలు అసలు నోట్లు ఇస్తామని విధ్యార్థులకు మోతేశ్యామ్ కమీషన్ ఆశచూపాడు .వాజీదుద్దీన్ నకిలీ నగదు చలామణి విషయంలో సమద్ సహయం తీసుకొన్నాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్టు శంషాబాద్ డిసిపి పద్మజారెడ్డి తెలిపారు.

English summary
two students who were circulating fake Rs 2,000 currency notes in the canteen of an engineering college were arrested by Cyberabad police on Thursday, together with two other persons, said to be the masterminds of the scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X