హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరా కానుక: ‘ హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్’ యాప్ ఆవిష్కరణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి నిత్యం అసవరపడే ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్' మొబైల్ యాప్‌తోపాటు ట్రాఫిక్ సిబ్బంది ట్యాబ్‌ల ద్వారా ఉపయోగించే 39(బి) సీపీ యాక్టు పేరుతో మరో మొబైల్ అప్లికేషన్‌ను పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక విప్లవంలో నగర ట్రాఫిక్ పోలీసులు క్యాష్‌లెస్ చాలానాల సిస్టమ్‌తో దేశంలోని ఇతర రాష్ర్టాల పోలీసులకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఇప్పుడు టెక్నాలజీ వాడకంలో మరో అడుగుముందుకేసి సామాన్య ప్రజలకు ఎంతో అవసరమయ్యే ట్రాఫిక్ లైవ్ యాప్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

పౌరుడి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే సేఫ్‌గా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా సకల సదుపాయాలతో యాప్‌ను తయారు చేశారన్నారు. మున్ముందు వచ్చే ఆలోచనలు, మరిన్ని సౌకర్యాలను ఇదే అప్లికేషన్‌కు జతచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో ఎక్కితే ఎంత దూరం వెళ్తే ఎంత ఛార్జీ అవుతుందని తెలుసుకునే సౌకర్యం ఈ యాప్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇది ప్రయాణికుడికి, అటూ ఆటోవాలకు ఇద్దరికి ఎంతో ఉపయోగమన్నారు. అలాగే, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఎదురైతే వెంటనే యాప్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడ వాలిపోతారన్నారు.

అంతేకాకుండా ట్రాఫిక్ రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది.. ప్రత్యామ్నాయ రూట్ల వివరాలను వాహనదారుడు ఈ యాప్ ద్వారా తెలుసుకుని సునాయసంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చన్నారు. కాగా, రోడ్లు వెడల్పు చేస్తున్నా, పుట్‌పాత్‌లు మాత్రం ఆక్రమణలకు గురవుతూ పాదచారుడు నడువలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

హైదరాబాద్ నగర ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగిస్తున్నారు.

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి నిత్యం అసవరపడే ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్' మొబైల్ యాప్‌తోపాటు ట్రాఫిక్ సిబ్బంది ట్యాబ్‌ల ద్వారా ఉపయోగించే 39(బి) సీపీ యాక్టు పేరుతో మరో మొబైల్ అప్లికేషన్‌ను పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక విప్లవంలో నగర ట్రాఫిక్ పోలీసులు క్యాష్‌లెస్ చాలానాల సిస్టమ్‌తో దేశంలోని ఇతర రాష్ర్టాల పోలీసులకు ఆదర్శంగా నిలిచారన్నారు.

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

ఇప్పుడు టెక్నాలజీ వాడకంలో మరో అడుగుముందుకేసి సామాన్య ప్రజలకు ఎంతో అవసరమయ్యే ట్రాఫిక్ లైవ్ యాప్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్'

పౌరుడి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే సేఫ్‌గా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా సకల సదుపాయాలతో యాప్‌ను తయారు చేశారన్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు టెక్నాలజీతో ఆక్రమణలను సాక్ష్యాధారాలతో రుజువు చేసేందుకు మరో యాప్‌ను తయారు చేసినట్లు చెప్పారు. దీని ద్వారా పుట్‌పాత్ ఆక్రమణ చేసిన వారికి జరిమానా విధిస్తూ, అక్కడ ఫొటోలు తీసి, ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తామన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరి టెక్నాలజీ సహాయంతో సాక్ష్యాలతో సహా కోర్టు ముందుకు వెళ్తే, రిపీటెడ్‌గా అఫెన్స్ చేసే వారికి న్యాయస్థానం తప్పని సరిగా శిక్ష విధిస్తుందన్నారు. కాగా, అంతకు ముందు కొత్త యాప్‌లు పనిచేసే విధానాన్ని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ యాప్ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం అండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ ట్రాఫిక్ లైవ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు అంజనీకుమార్, నాగిరెడ్డి, ట్రాఫిక్ డీసీపీలు రంగనాథ్, చౌవాన్, సిబ్బంది పాల్గొన్నారు.

English summary
Hyderabad Traffic Police today launched a Mobile App called "HYDERABAD TRAFFIC LIVE".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X