వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ తెలుగు మహాసభలు: ట్రాఫిక్ ఆంక్షలు ఇవీ...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మహాసభలు జరిగే ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.. స్డేడియం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.

Recommended Video

ప్రపంచ తెలుగు మహాసభలు : NTR నే మరిచిపోయారా ?

శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్‌ను మళ్లించారు. ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వైపు నుంచి బీజేఆర్‌ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్‌ రోడ్‌కు మళ్లిస్తారు.

 Hyderabad: Traffic restrictions for World Telugu Conference

అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రపం వైపు అనుమతించబోరు. వీటిని గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ నుంచి ఛాపెల్‌ రోడ్‌కు పంపిస్తారు. బషీర్‌బాగ్‌ చౌరస్తా నుంచి ఆబిడ్స్ జీపీవో వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్‌ కోఠి మీదుగా పంపిస్తారు.

ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు పంపిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ మీదుగా మళ్లిస్తారు

మహాసభలకు పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు హైదరాబాద్ ఇంచార్జీ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మహాసభలకు దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. భద్రత, బందోబస్తు విధుల కోసం నగర పోలీసు విభాగంలోని 9 వేల మందికి తోడు మరో మూడు వేల మందిని మోహరిస్తున్నట్టు చెప్పారు.

English summary
The traffic police has imposed traffic restrictions from December 15 to December 19 from 3 pm to 9 pm for the World Telugu Conference at LB Stadium in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X