హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా ఫేస్‌బుక్ పోస్టు... ఆ యూనివర్శిటీలో చెలరేగిన వివాదం

|
Google Oneindia TeluguNews

పుల్వామా దాడి జరిగి ఐదు రోజులు అయింది. దాడుల గాయాలనుంచి ఇంకా దేశం కోలుకోక ముందే.. హైదరాబాద్ సెంటల్రల్ యూనివర్శిటీలో ఓ ఫేస్ బుక్ పోస్టు టెన్షన్ వాతావరణం సృష్టించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఓ విద్యార్థి సంఘం పోస్టు పెట్టడంతో ఉద్రిక్తత వాతావరణం క్యాంపస్‌లో నెలకొంది. ఈ పోస్టును పెట్టింది స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంఘం.

పార్లమెంటు పై దాడిలో సూత్రధారిగా నిలిచిన ఉగ్రవాది అఫ్జల్ గురుపై సుప్రీం కోర్టు తీర్పును ఫేస్‌బుక్‌ పోస్టులో ప్రస్తావించింది స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. అఫ్జల్ గురును ఉరితీస్తేనే దేశప్రజలందరూ సంతృప్తి చెందుతారని నాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో అఫ్జల్‌కు ఉరి అమలు చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ విద్యార్థులు పోస్టు చేస్తూ ఓ వివాదాస్పద ట్యాగ్‌ను ఉంచారు.

Hyderabad university students union triggers row with pro-Afzal Guru post on Facebook

"రిమెంబరింగ్ అఫ్జల్ గురు, స్మాష్ కలెక్టివ్ కన్సైన్స్" అనే పదాలు ట్యాగ్‌లో చేర్చడంతో అసలు వివాదం తలెత్తింది. ఈ పోస్టును చూసిన బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ వెంటనే ఖండిస్తూ మరో పోస్టు పెట్టింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంస్థ పోస్టును ఏబీవీపీ ఖండిస్తోందని ఆ విద్యార్థి నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ అధ్యక్షుడు అభిషేక్.

అఫ్జల్ గురును గుర్తు చేసుకుంటే తప్పేముంది అని ప్రశ్నించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్టూడెంట్స్ ఇస్లాం విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఫసీ ప్రశ్నించారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడులు జరిగి 40 మంది జవాన్లు అమరులైన తర్వాత ఇస్లామిక్ విద్యార్థి సంఘం ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం కలకలం రేపుతోంది. ఎలాగైనా సరే పగతీర్చుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీరి విద్యార్థులకు మెసేజ్‌లు వెళుతున్నట్లు సమాచారం.

English summary
The University of Hyderabad chapter of student organisation, Students Islamic Organisation, has sparked a major controversy with one of its Facebook posts "remembering Afzal Guru".Just five days after the Pulwama terror attack and simmering tension across the country, SIO's Facebook post has invited the wrath of many right wing outfits.The post quotes a part of the Supreme Court verdict on Afzal Guru's hanging, which talks about the "collective conscience" that would be satisfied if he is hanged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X