హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారుతోంది, సేఫ్ సిటీ: ఐటి మంత్రి కెటిఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరం ఐటీ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. మాదాపూర్‌లో యానిమేషన్ అండ్ గేమింగ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను ఐటీ రంగానికి చిరునామగా మారుస్తామని చెప్పారు.

గేమింగ్, యానిమేషన్ స్టార్టప్ సంస్థలకు విస్తృత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. టీహబ్‌లో డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల స్టార్టప్‌లను పరిశీలిస్తారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమన్నారు.

Hyderabad will become a IT Hub, says KTR

వచ్చే ఏడాది ప్రథమార్థంలో హైదరాబాద్‌లో ఇమేజ్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 28న ఐటీ రంగానికి సంబంధించిన 4 కొత్త పాలసీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని పేర్కొన్నారు.

ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ప్రమాదం

ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ప్రమాదమని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉగ్రవాదాన్ని ఏ మతమూ ప్రోత్సహించదని, హింసతో సాధించేదేమీ లేదని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు.

English summary
Telangana Minister KT Rama Rao on Saturday said that Hyderabad will become a IT Hub.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X