హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతర్జాతీయస్థాయి గుర్తింపు: హైదరాబాద్ అమ్మాయిలు అదుర్స్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు చేరి హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సింధు అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. ఒకవేళ ఓడినా రజత పతకంతో సగర్వంగా భారత్‌కు తిరిగి వస్తుంది.

తెలుగు జాతి గర్వించేలా రియో ఒలింపిక్స్‌లో సింధు భారత్‌కు పతకం సాధించి పెట్టడం ఇప్పటికే ఖాయమైపోయింది. భారతావనితో పాటు తెలుగు జాతి మొత్తం సింధు ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి స్వర్ణం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సింధు సిటీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది.

హైదరాబాద్ క్రీడా హబ్‌గా ఒక వెలుగు వెలుగొందడంలో పలువురి కృషి ఉంది. నగరానికి చెందిన పలువురు క్రీడాకారులు క్రీడల్లో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపారు. టెన్నిస్‌లో సానియా మిర్జా, క్రికెట్‌లో మిథాలీ రాజ్, బాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, కశ్యప్‌లాంటి ఆటగాళ్లు నగరానికి చెందిన వారే.

అంతేకాదు హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హాబ్‌గా తీర్చిదిద్దడంలో ఎంతగానో కృషి చేస్తున్నారు. మరింతమందిని ప్రోత్సహించేందుకు గాను స్పోర్ట్స్ అకాడమిలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌గా ఓ వెలుగు వెలిగిన వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్‌లు అకాడమీలు పెట్టి ఆటను ప్రమోట్ చేయడంతో పాటు అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేస్తున్నారు.

రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తీసుకొస్తున్న పీవీ సింధు ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచే వచ్చింది. గతేడాది వీవీఎస్ స్పోర్ట్స్ అకాడెమీని ప్రారంభించిన ఆయన లక్ష్మణ్ ఆసక్తి ఉన్న చిన్నారుల్ని ఇంటర్నేషనల్ క్రికెటర్స్‌గా తీర్చిదిద్దుతున్నారు.

సింధు

సింధు

నగరానికి చెందిన పలువురు క్రీడాకారులు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపారు. క్రీడల్లో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో సింధు పలు అంతర్జాతీయ టోర్నీల్లో విజయం సాధించింది.

 సానియా మిర్జా

సానియా మిర్జా

నగరానికి చెందిన పలువురు క్రీడాకారులు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పలు అంతర్జాతీయ టోర్నీల్లో విజయం సాధించింది.

 మిథాలీ రాజ్

మిథాలీ రాజ్

నగరానికి చెందిన పలువురు క్రీడాకారులు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపారు. క్రికెట్ లో రాణిస్తున్న మిథాలీ రాజ్ హైదరాబాద్ కు చెందిన అమ్మాయే.

 సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

నగరానికి చెందిన పలువురు క్రీడాకారులు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో సైనా నెహ్వాల్ పలు అంతర్జాతీయ టోర్నీల్లో విజయం సాధించింది.

English summary
Hyderabad will become a sports of india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X