వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో పనిచేస్తానంటున్న తొలి ఆర్టీసి డ్రైవర్ సరిత

దేశంలోని ఆర్టీసి తొలి మహిళా డ్రైవర్ సరిత తెలంగాణలో పనిచేస్తానని అంటున్నారు. ఆమె ఢిల్లీ ఆర్టీసిలో కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేస్తున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలోని తొలి ఆర్టీసి మహిళా డ్రైవర్ సరిత తాను తెలంగాణలో పనిచేస్తానని అంటున్నారు. సచివాలయంలో శుక్రవారం ఢిల్లీ ఆర్టీసిలో డ్రైవర్‌గా పని చేస్తున్న సరిత మంత్రిని కలిసి తనకు టిఎస్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

రానున్న రోజుల్లో ఆర్టీసీలో అర్హతలను బట్టి మహిళా డ్రైవర్లకు అవకాశం కల్పించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సరిత అర్హతలు పరిశీలించిన మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించారు. ఆర్టీసీలో మహిళలకు చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు.

గతంలో జరిగిన నియామకాల్లో మహిళలు కండక్టర్లుగా ముందుకు వచ్చినా డ్రైవర్లుగా రాలేదని ఆయన చెప్పారు. అయితే సరిత లాంటి వారు ముందుకు వస్తే నియామకాల్లో మహిళా కోటా ఆధారంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ్‌పూర్ మండలానికి చెందిన సరిత ఢిల్లీ ఆర్టీసీలో గత మూడేళ్ల నుంచి ఢిల్లీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తోందని, రాబోయే కాలంలో నియామకాల్లో ఆమెకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

Hyderabad: Woman bus driver seeks TSRTC job

పలు రివార్డులు, రికార్డులున్న సరిత లాంటి మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సరిత కోరుకుంటే షీ క్యాబ్ కూడా ఇప్పించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

యాదాద్రి భువనగిరి జిల్లాసంస్థాన్ నారాయణ్ పూర్‌మండలం మామిల్లపల్లి పంచాయతీ పరిధిలోని రోళ్లబండ తండాకు చెందిన గిరిజన మహిళ వాంకుడోతు సరిత ఢిల్లీలోని ఆజాద్ హింద్ ఫౌండేషన్ కింద క్యాబ్ డ్రైవర్‌గా పని చేశారు.
దేశంలోనే తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా ఉమెన్ అచీవర్ అవార్డు పొందారు.

తనకన్నా పెద్ద వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడంతో వృద్ధులైన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండడం కోసం తెలంగాణా ఆర్టీసీలో పని చేయాలని అనుకుంటున్నట్లు సరిత తెలిపారు.

English summary
The first woman bus driver Varkya Saritha from Yadadri district and working with Delhi Transport Corporation (DTC) is seeking a job in Telangana State Road Transport Corporation (TSRTC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X