• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అనుమానంతో దుస్తులు విప్పి దారుణంగా కొట్టేవాడు... వాన్ని వదిలిపెట్టకండి.. సూసైడ్ నోట్‌లో వివాహిత..

|

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవనర్మణానికి పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త... అక్రమ సంబంధాలు అంటగట్టి తనను చావగొడుతున్నాడని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. తనను చంపేందుకు ప్లాన్ కూడా చేస్తున్నాడని... తాను చనిపోయినా సరే వాన్ని మాత్రం వదలకండి అని విజ్ఞప్తి చేసింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ సమీపంలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లో విజయ(31)-ఆంజనేయులు దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 14 ఏళ్ల క్రితం విజయ ఆంజనేయులును ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే ఆమెకు భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఎప్పుడూ ఆమెను అనుమానిస్తూ చితకబాదేవాడు. అయినప్పటికీ పిల్లల కోసం ఆమె సంసారాన్ని నెట్టుకొస్తోంది.

చంపేస్తానని బెదిరించిన భర్త...

చంపేస్తానని బెదిరించిన భర్త...

ఇదే క్రమంలో మంగళవారం(ఏప్రిల్ 27) తెల్లవారుజామున ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. పెళ్లయిన మొదటిరోజు నుంచే తమ అల్లుడు ఆంజనేయులు విజయను అనుమానంతో హింసిస్తున్నాడని మణెమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ రాత్రి 8గంటలకు విజయ తనకు ఫోన్ చేసి పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పిందన్నారు. ఆ తర్వాత రెండు గంటలకు మళ్లీ ఫోన్ చేసి భర్త తనను కొట్టినట్లుగా చెప్పి ఏడ్చిందన్నారు.

అక్రమ సంబంధాలు అంటగట్టి చావగొట్టేవాడు..

అక్రమ సంబంధాలు అంటగట్టి చావగొట్టేవాడు..

ఆ సమయంలో విజయ ఫోన్ లాక్కున్న ఆంజనేయులు మీ కూతురిని చంపేస్తానని ఫోన్‌లో నన్ను హెచ్చరించాడంటూ మణెమ్మ వాపోయారు. తెల్లవారేసరికి అన్నంత పనిచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు మరణానికి అల్లుడు ఆంజనేయులే కారణమని మణెమ్మ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విజయ గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. 'నా పేరు విజయ... భర్త వేధింపులు తాళలేక చనిపోతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటినుంచి నన్ను చిత్రహింసలు పెడుతూనే ఉన్నాడు. నన్ను డ్యూటీకి వెళ్లమని చెప్తాడు. వెళ్తే అక్రమ సంబంధాలు అంటగడుతాడు. ఒంటి మీద దుస్తులు విప్పి విపరీతంగా కొట్టేవాడు.' అని సూసైడ్ నోట్‌లో విజయ పేర్కొంది.

  TS : Include COVID-19 Treatment Under Aargoyasri : Seethakka
  వాన్ని మాత్రం వదలకండి అని...

  వాన్ని మాత్రం వదలకండి అని...


  'నా భర్త నన్ను చంపాలని చూశాడు. వాళ్ల అన్న చంద్రయ్య అండతో నన్ను మరింత వేధించాడు. నన్ను చంపేస్తే వాళ్ల అక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని ఆంజనేయులతో అతని అన్న చెప్పేవాడు. నా చావుకు ముఖ్య కారణం అన్నాదమ్ములే. నా పిల్లలను మా అమ్మానాన్న,అన్నాదమ్ముల వద్ద ఉంచండి. నేను చనిపోయినా నా భర్తను మాత్రం వదలకండి.' అంటూ సూసైడ్ నోట్‌లో విజయ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆంజనేయులును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

  English summary
  A tragic incident took place at the Jubilee Hills police station in Hyderabad. A married woman commits suicide after being harassed by her husband. The suicide note states that her husband is suspecting and harassing from day one of their marriage.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X