హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే కాన్పులో నలుగురు శిశువులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఒకే కాన్పులో కవలలు పుట్టడం సహజం. అయితే నలుగురు కవలలు పుట్టిన అరుదైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చిలకలగూడలోని గీతా నర్సింగ్ హోంలో హేమలత అనే మహిళ ఒకేకాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల్లో ఇద్దరు అబ్బాయిలు కాగా.. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ నెల 2వ తేదీన డెలివరీ అయినా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చిలకలగూడకు చెందిన హేమలతకు నెలలు నిండకముందే పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో ఆమె భర్త లక్ష్మణ్ దగ్గరలోని గీతా నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి నలుగురు శిశువులను డెలివరీ చేశారు. పిల్లల బరువు తక్కువగా ఉండటంతో వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. దీంతో చిన్నారులను విద్యానగర్‌లోని నియో బీబీసీ హాస్పిటల్‌కు తరలించారు. పుట్టినప్పుడు కేవలం కిలో బరువున్న శిశువులకు ఆత్యాధునిక చికిత్స అందించడంతో వారి పరిస్థితి మెరుగైంది. ప్రస్తుతం శిశువుల బరువు కిలోన్నర వరకు చేరింది. ప్రస్తుతం శిశువుల ఆరోగ్య పరిస్థితి బాగుందని డాక్టర్లు చెప్పారు.

Hyderabad woman delivers quadruplets
English summary
Hyderabadi woman gave birth to quadruplets in a private hospital in Chilkalguda. Though the woman delivered the newborns on April 2, it came to light on Sunday as the babies were shifted to Neo BBC hospital for better treatment. doctors said that it is a rare case and added that the quadruplets are born once in every seven lakh births.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X