• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆమె స్కూల్ డ్రాపౌట్: మోసాల్లో గుండెలుతీసిన బంటు

|

హైదరాబాద్: ఆమె 2000 సంవత్సరంలో స్కూల్ డ్రాపవుట్. ఆ తర్వాత చిన్న ఉద్యోగం చేసింది. అప్పుడే ఆమెకు కష్టపడకుండా సంపాదించాలనే కోరిక వచ్చింది. దీంతో చిన్న చిన్న మోసాలు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె వివాహం చేసుకుని.. భర్తను కూడా మోసాల్లో భాగస్వామిని చేసింది. అనంతరం అతనితో విడిపోయింది. ఆమె మోసాల్లో భాగస్వాములయ్యేందుకు వచ్చిన పురుషులతో ఆమె సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. ఆ తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె బారిన పడి రూ. లక్షల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె గుట్టురట్టయింది. కటకటాలపాలైన ఆమే హేమ అలియాస్ అలేఖ్య రెడ్డి అలియాస్ బుజ్జి(29).

ఆమె మోసాలపై జూబ్లీహిల్స్, సనత్‌నగర్‌లతోపాటు మరికొన్ని పోలీస్ స్టేషన్లు దర్యాప్తును ప్రారంభించాయి. కాగా, ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్ జివి రమణ గౌడ్ ఆమె(హేమ) మోసాలకు సంబంధించిన వివరాలను తెలిపారు. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన అలేఖ్యరెడ్డి (29) అలియాస్ బుజ్జి, అలియాస్ హేమ నగరంలోని ఎస్‌ఆర్‌నగర్ రాజీవ్‌నగర్‌లో గత కొంతకాలంగా నివాసముంటోంది.

Hyderabad: Woman held for fraud, extortion

తన భర్త, బాబాయ్, ఇతర కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ డీసీపీని ఆశ్రయించింది. ఈ కేసును డీసీపీ ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు సిఫారసు చేయడంతో హేమ ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌కు చేరుకుంది. గతంలో హేమ ముఖ కవళికలను చూసిన అనుమానం వచ్చిన పోలీసులకు.. గతంలో తమకు అందిన ఫిర్యాదుల తాలూకు వ్యక్తేనని నిర్ధారించుకుని తమదైన శైలిలో హేమను ప్రశ్నించారు. దీంతో ఆమె తన మోసాలను ఒప్పుకుంది.

హేమకు ఇంగ్లిష్ పరిజ్ఞానం, ఎదుటి వారిని బుట్టలో వేసుకునే తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్ పరిధిలోని బల్కంపేట, జవహర్‌నగర్ ప్రాంతాల్లో అనేక మందికి ఇళ్ల స్థలాలు, పట్టాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది వద్ద రూ. 30వేల నుంచి 50 వేల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతుండేది. ఇటీవలే ఎస్‌ఆర్‌నగర్‌లో బల్కంపేటకు చెందిన బాధితులంతా ఫిర్యాదు చేశారు.

హేమకు అలియాస్ అలేఖ్య, అలియాస్ బుజ్జీ, అలియాస్ శైలు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నలుగురిని పెళ్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, బుధవారం ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో తన భర్త కిశోర్ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసేందుకు ఆమె వచ్చింది. ఆ మహిళను ఎస్సై సైదులు గుర్తించి, వెంటనే పాత కేసుల తాలూకు వివరాలను పరిశీలించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
“She was a school dropout in early 2000 and was doing petty jobs. Slowly she started frauds. She got married and involved her husband too in frauds. However, they broke up and she established relationships with other men who joined her frauds,” said SR Nagar inspector G.V. Ramana Goud. Hema married twice and has two children. She was booked by the SR Nagar police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more