హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి కోసం డాక్టర్ వేషం,స్టెత్, ఆప్రాన్ కొనుగోలు, బండారం బట్టబయలైందిలా...

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రియుడి కోసం డాక్టర్ వేషం వేసిన ప్రియురాలిని ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రియుడిని నమ్మించేందుకు గాను నకిలీ డాక్టర్ అవతారం ఎత్తినట్టుగా ఆమె అసలు విషయాన్ని చెప్పింది. అయితే నకిలీ డాక్టర్ ను పట్టించడంలో కీలకంగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అభినందించారు.

సంగారెడ్డికి చెందిన రిజ్వానాబేగం భర్తతో విడాకులు తీసుకొని బోయిన్‌పల్లిలో నివాసం ఉంటుంది. ఆమెకు స్థానికంగా నివాసం ఉండే ఆమె బంధువు కరీంతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది.

అయితే తన ప్రియుడికి ఆమె తాను వైద్యురాలిగా పరిచయం చేసుకొంది. అయితే ప్రియుడు ఆమె మాటలను నమ్మాడు. అయితే డాక్టర్ గా పనిచేస్తున్న తన ప్రియురాలిని ప్రియుడు కరీం సహయం అడిగాడు. దీంతో ప్రియురాలి అసలు వ్యవహరం బట్టబయలైంది.

 ప్రియుడి కోసం డాక్టర్ అవతారం

ప్రియుడి కోసం డాక్టర్ అవతారం

బోయిన్‌పల్లిలోనివాసం ఉండే రిజ్వానా బేగం స్థానికంగా ఉండే బంధువైన కరీంతో ప్రేమలో పడింది. రిజ్వానా తన ప్రియుడికి తాను డాక్టర్ గా పనిచేస్తున్నానని నమ్మించింది. అయితే కరీం బంధువు ఒకామె ఆత్మహత్యాయత్నం చేసుకొని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయమై తనకు సహాయం కావాలని ప్రియురాలు రిజ్వానాబేగంను కరీం కోరాడు. అయితే ఈ విషయంలో సహయం చేస్తానని హమీ ఇచ్చిన రిజ్వానాను గాంధీ ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఆమె డాక్టర్ కాదని గుర్తించారు. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు.

ప్రియుడి కోసం స్టెతస్కోప్ కొనుగోలు

ప్రియుడి కోసం స్టెతస్కోప్ కొనుగోలు


కరీం గాంధీ ఆసుపత్రిలో ఉన్న తన బంధువును చూసేందుకు సహయం చేయాలని రిజ్వాన్ సహయం కోరారు. తాను డాక్టర్ గా పనిచేస్తున్నట్టు రిజ్వానా కరీంను నమ్మించింది. దీంతో గాంధీ ఆసుపత్రిలో పనిచేసే వైద్యురాలిగా కరీం ను నమ్మించేందుకు రిజ్వానా ప్లాన్ చేసింది. ఈ మేరకు ఆమె స్టెతస్కోప్, ఆఫ్రాన్ ను కూడ కొనుగోలు చేసింది. ఎలాంటి అనుమానం రాకుండా గాంధీ ఆసుపత్రి వరకు ప్రియుడిని తీసుకెళ్ళింది. అయితే గాంధీ ఆసుపత్రి సిబ్బంది నకిలీ డాక్టర్‌ రిజ్వానాను గుర్తించారు.

నకిలీ డాక్టర్ ను గుర్తించిన సెక్యూరిటీ

నకిలీ డాక్టర్ ను గుర్తించిన సెక్యూరిటీ

గాంధీ ఆసుపత్రిలో రెండు రోజులుగా రిజ్వానా డాక్టర్ గా నమ్మిస్తోంది. తన హ్యాండ్ బ్యాగులో ఆప్రాన్, స్టెతస్కోప్ ను తీసుకొని ఆసుపత్రి నుండి వెళ్ళి వస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఆపితే డాక్టర్ అని ఆమె తన హ్యాండ్ బ్యాగులో ఉన్న స్టెతస్కోప్, ఆప్రాన్ ను చూపిస్తోంది. రెండు రోజులుగా ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు వాటిల్లలేదు.అయితే గురువారం నాడు తన ప్రియుడు కరీంతో పాటు మరో వ్యక్తిని తీసుకొని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. తాను పనిచేసేది ఐసీయూ వార్డును చూపింది. అయితే అక్కడే పనిచేస్తున్న సెక్యూరిటీ ఇంఛార్జీ ప్రదీప్, సూపర్ వైజర్ జంగయ్య నకిలీ డాక్టర్ రిజ్వానాను అనుమానంతో ప్రశ్నించారు. అయితే తన బ్యాగులోని స్టెతస్కోప్, ఆఫ్రాన్ ను రిజ్వానా చూపింది. గుర్తింపుకార్డును ఇంటి వద్దే మర్చిపోయాయని ఆమె చెప్పింది.అయితే ఐసీయూ వార్డులో ఆమె పని చేయడం లేదని సెక్యూరిటీ సిబ్బంది నిర్ధారించుకొన్నారు.

పోలీసులకు అప్పగింత

పోలీసులకు అప్పగింత

నకిలీ డాక్టర్ రిజ్వానాను ఐసీయూలోకి తీసుకెళ్ళి విచారించారు. ఆమె అక్కడ పనిచేయడం లేదని అక్కడ పనిచేసే సిబ్బంది తేల్చి చెప్పారు. మరో వైపు ఆమె ఏ విభాగంలో పనిచేస్తోందో ప్రశ్నించారు. అయితే ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో గాంధీ ఆసుపత్రి వద్ద పోలీస్ ఔట్ పోస్ట్ లో అప్పగించారు.పోలీసుల విచారణలో రిజ్వానా అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో రిజ్వానాతో ఆమె ప్రియుడు కరీం, వారితో పాటు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సెక్యూరిటీ సిబ్బందిని గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ కుమార్ అభినందించారు.

English summary
The Chilkalguda police arrested three persons, including a woman, on Thursday morning for allegedly impersonating as doctors and trying to gain entry into the labour ward of Gandhi Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X