హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం పేరుతో దుబాయ్‌‌కు: ఇంటిపనితో చిత్రహింసలు: హైదరాబాదీల దీనావస్థ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో నకిలీ ఏజెంట్ల మోసాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. నకిలీ ఏజెంట్ల దురాగతాలకు అడ్డుకట్ట పడట్లేదు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి.. అక్కడ చిక్కుకుపోతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దుబాయ్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఆకర్షణీయమైన జీతాన్ని ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు గురి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది.

బ్యూటీ పార్లర్ పేరులో ఉద్యోగం కల్పిస్తామని నమ్మించిన ఏజెంట్లు.. కొందరు మహిళలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత.. వారికి అలాంటి ఉద్యోగం ఏదీ కల్పించలేదు. స్థానిక షేక్‌ల ఇళ్లల్లో ఇంటిపనికి కుదిర్చారు. అక్కడ వారు చిత్రహింసలకు గురవుతున్నారు. పాతబస్తీకి చెందిన అయిదుమంది మహిళలు తాజాగా నకిలీ ఏజెంట్ల వలలో పడ్డారు. బ్యూటీ పార్లర్, కొన్ని షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్ ఉద్యోగాను ఆశగా చూపించి, అక్కడికి పంపించిన తరువాత.. తమవారిని ఇంటిపనిలో చేర్చారని బాధిత మహిళల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Hyderabad woman urge the govt to rescue and repatriate their family members, who are stuck in UAE

ఇంటి పనిలో ఉన్న తమ వారిని యజమానులు రోజూ చిత్రహింసకు గురి చేస్తున్నారని, కనీసం ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా కల్పించట్లేదని చెప్పారు. ప్రతి రోజు వేధింపులు గురవుతున్నారని, రోజూ 16 నుంచి 18 గంటల పాటు ఇంటి పని చేయిస్తున్నారని అన్నారు. కనీస విశ్రాంతి తీసుకోనివ్వట్లేదని, శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధితుల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపారు.

తమ కుటుంబ సభ్యులను వెంటనే కాపాడాలని, వారిని స్వదేశానికి తీసుకుని రావడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రాధేయపడుతున్నారు. మూడు నెలల విజిటింగ్‌ వీసాలతో తమ వారిని ఎమిరేట్స్, దుబాయ్‌కు పంపించినట్లు తెలిసిందని, దీనిపై తాము స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళల కుటుంబ సభ్యులు చెప్పారు. తమ తరపున దుబాయ్‌కి పంపించిన అనంతరం వాళ్లు ఇచ్చే కమిషన్ల కోసం నకిలీ ఏజెంట్లు కక్కుర్తి పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము వారిని ఏజెంట్లను సంప్రదించడానికి ప్రయత్నించగా.. అందుబాటులో లేరని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు.

English summary
Three families urge the Indian govt to rescue and repatriate their family members, who are stuck in the United Arab Emirates after being cheated for work by a travel agent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X