హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: ప్రియురాలి మోసం, కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

ఒట్టావా/హైదరాబాద్: ప్రేమించిన యువతి తనను మోషం చేసిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు నైట్రోజన్ గ్యాస్ పీల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కెనడాలో తెలుగు యువకుడు బలవన్మరణంతో హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో విషాదం నెలకొంది.

హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో నివాసం ఉండే ప్రణయ్ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, ప్రియురాలు మోసం చేసిందని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనతోపాటు మరో ఆరుగురు యువకులను మోసం చేసిందంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

 hyderabad youth committed suicide in canada due to love failure

సిగరెట్లు తాగుతూ తనను కూడా స్మోక్ చేయాలని బలవంతం పెట్టిందని తెలిపాడు. చివరికి హెచ్1 వీసా రాగానే తనకు తెలియకుండా మోసం చేసి వెళ్లిపోయిందని ప్రణయ్ తెలిపాడు. తనతో సహజీవనం చేస్తూనే మాజీ ప్రియుడితో చాట్ చేసేదని, చాటింగ్ చేయవద్దని చెప్పినందుకు తరచూ గొడవపడేదని ప్రణయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

తనను పెళ్లి చేసుకుందామని తాను అనుకుంటే తనను మోసం చేసిందన్నాడు. ఆమె తల్తిదండ్రులు కూడా ఇప్పుడు వారి కూతురుకే మద్దతుగా ఉన్నారని, తనపై కేసు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపాడు. ఆ యువతి మోసాల గురించి తెలపాలని తాను ఇలా సూసైడ్ నోట్‌లో వివరించి చనిపోతున్నట్లు పేర్కొన్నాడు.

మద్యం, సిగరెట్లు కాల్చుతూ ఉండేదని, ఇలాంటి పనులు చేయవద్దని చెప్పినందుకే తనను మోసం చేసిందని, దీంతో మనస్తాపం చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రణయ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన గురించి ఎవరూ బాధపడవద్దని, తన అవయవాలు దానం చేయాలని, తన శరీరాన్ని కూడా పరిశోధనల్లో వాడేలా చూడాలంటూ ప్రణయ్ తన తల్లిదండ్రులను కోరాడు. ఆత్మహత్య ఘటనపై కుటుంబసభ్యులకు కెనడా అధికారులు తెలిపారు.

అనంతపురంలో..

కాగా, అనంతపురంలోని ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీరుగా విలపిస్తున్నారు. ప్రణయ్ మృతిపై తమకు అనుమానాలున్నాయని తండ్రి నారాయణస్వామి ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో అఖిల తన కొడుకునుకు మోసం చేసిందని అన్నారు. కరోనా నేపథ్యంలో పెళ్లి ఇప్పుడేవద్దంటూ మాయ చేసిందన్నారు. అఖిల, అమె తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రణయ్ తండ్రి నారాయణస్వామి ఆరోపించారు.

English summary
hyderabad youth committed suicide in canada due to love failure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X