• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందుబాబుల షాక్... బ్రీత్ అనలైజర్‌తో పరార్...

|

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ట్రాఫిక్ పోలీసులకు మందు బాబులు షాకిచ్చారు.డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్‌తో టెస్టులు చేస్తుండగా... ఇద్దరు యువకులు ఆ మెషీన్ లాక్కుని పారిపోయారు.దీంతో అవాక్కయిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ సమీపంలో శుక్రవారం(సెప్టెంబర్ 18) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు నేతృత్వంలో సీఆర్ ఫౌండేషన్ వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రాత్రి 11.45గంటల సమయంలో మియాపూర్ వైపు నుంచి వస్తున్న ఓ బైక్‌ను పోలీసులు ఆపారు.బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేసేందుకు... ఆ మెషీన్ తీసి అందులో ఒకరి నోటి వద్ద పెట్టారు.నోటితో మెషీన్‌లోకి ఊదబోయిన యువకుడు... ఆ వెంటనే దాన్ని లాగేసుకున్నాడు.క్షణాల్లో బైక్‌ను రయ్యిమని ముందుకు పోనిచ్చాడు.దీంతో షాక్ తిన్న పోలీసులు ఆ బైక్‌ను ఫాలో అయినప్పటికీ పట్టుకోలేకపోయారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఇద్దరు మందుబాబులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కోవిడ్ కారణంగా చాలా రోజుల పాటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే మళ్లీ డ్రంకన్ డ్రైవ్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

hyderabad youth fled with breath analyzer machine while police conducting drunk and drive tests

ఆది,సోమవారాల్లో మద్యం షాపులు బంద్ :

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 19,20 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.ఈ రెండు రోజులు హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో వైన్స్, బార్లు, ప‌బ్‌లు మూసి ఉంటాయ‌ని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 19వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి 20న సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం విక్రయాలు ఉండవన్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు :

వినాయక నిమజ్జనం నేపథ్యంలో నగరంలో ఆది,సోమవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్థరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధాజ్ఞలు అమలులోకి రానున్నాయి. ఆర్టీసీ బస్సులను సైతం పలు చోట్ల దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర సాగే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలను సూచించేలా సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షలపై సమాచారం కోసం 040-27852482, 9490598985, 9010303626 నంబర్లలో సంప్రదించవచ్చు.

ట్యాంక్ బండ్ సమీపంలో సందర్శకుల వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్‌లో విశ్వేశ్వరయ్య భవన్‌, ఎంఎంటీఎస్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఆనంద్‌నగర్‌ కాలనీ, బుద్ధ భవన్‌, గోసేవా సదన్‌, కట్టమైసమ్మ టెంపుల్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద పార్కింగ్‌ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌‌లో నిమజ్జనం తర్వాత విద్యానగర్‌ మీదుగా వాహనాలు వెళ్లనున్నాయి. అంతర్‌ రాష్ట్ర బస్సులు, లారీలకు నగరంలోకి అనుమతి నిరాకరిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. ఇతర ప్రాంతాలకు ఔటర్‌ రింగురోడ్డు నుంచి వెళ్లాలని సూచించారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ఇతర వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.

English summary
Two drunken youth given shock to traffic police in Kondapur, Hyderabad during drunk and drive tests. While conducting tests with a breath analyzer as part of a Drunken Drive check, two youths fled the machine. The incident took place on Friday (September 18) night near the CR Foundation in Kondapur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X