హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫన్ కోసమే కుక్క పిల్లను సజీవ దహనం చేశాం: పిల్లలకు పోలీసుల కౌన్సిలింగ్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడు కుక్క పిల్లలను సజీవ దహనం చేసిన ఘటనలో పాల్గొన్న 8 మంది పిల్లలను గురువారం ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి జువనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు ఇన్‌‍స్పెక్టర్ బిట్టు మోహన్ కుమార్ తెలిపారు.

నిందితులు అరెస్ట్: కుక్క పిల్లలను సజీవ దహనం చేశారిలా (ఫోటోలు)

మైదానంలో క్రికెట్ ఆడుతుండగా కుక్క పిల్లలు అరిచాయని, దాంతో చిరాకుగా అనిపించి వాటిని సజీవ దహనం చేశామని పిల్లలు పోలీసులకు వివరించారు. అరెస్ట్ చేసిన ఎనిమిది మంది నిందుతులను జువనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచి, అనంతరం జువనైల్ బాలుర హోంకు తరలించామని చెప్పారు.

పిల్లలందరూ కూడా 14 ఏళ్ల వయసు లోబడి వారు కావడంతో ఆగస్టు 2వ తేదీ వరకు జువనైల్ హోంలోని ఉంటారని ఆయన పేర్కొన్నారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చామని ఆయన చెప్పారు.

Hyderabad: Youths say 'burnt puppies for fun',

వివరాల్లోకి వెళితే... ఈ నెల 16న దయారా మార్కెట్ కమాన్‌కు సమీపంలోని బహదూర్‌యార్ జంగ్ శ్మశానవాటికలో పటాన్ బస్తీకి చెందిన ఆరుగురు విద్యార్ధులతోపాటు మరో ఇద్దరు మైనర్లు మూడు కుక్క పిల్లలను తాళ్లతో కట్టేసి మంటల్లో వేసి, కేరింతలు కొడుతూ పైశాచికానందం పొందారు.

మంటలకు తాళలేక బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన కుక్క పిల్లలను కట్టెలతో కొట్టి మళ్లీ మంటల్లోకే నెట్టారు. కుక్క పిల్లలు సజీవ దహనంఇదంతా సెల్‌ఫోన్లతో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఘటన వెలుగు చూసింది.

ఒళ్లు జలదరించేలా: నవ్వుతూ.. కుక్క పిల్లల్ని మంటల్లో కాల్చేశారు

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ఈ వీడియోను చూసిన హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా సభ్యురాలు శ్రేయ చేసిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది మైనర్లను అరెస్ట్ చేసి సైబరాబాద్‌లోని జువనైల్ హోంకు తరలించారు. పిల్లలను సక్రమంగా పెంచాలని తల్లిదండ్రలకు సూచించారు.

ఫోరెన్సిక్‌ నిపుణులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కాలిన కుక్కపిల్లల శరీర భాగాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు జంతు చట్టం ప్రకారం నిందితులపై ఐపీసీ 428 కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

English summary
The eight boys who were involved in burning three puppies alive were produced before the Juvenile Justice Board on Thursday. They admitted they had killed the puppies for fun as their noise was irritating them while they were playing cricket. Cops have counselled the parents of the boys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X