వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9 మందికి అవయవదానం చేసి పేరు సార్ధకం చేసుకున్న చరితారెడ్డి ..చనిపోయినా ఆమె చరిత శాశ్వతం

|
Google Oneindia TeluguNews

9 మందికి అవయవదానం చేసి పేరు సార్ధకం చేసుకుంది చరితారెడ్డి. అమెరికా రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆమె అవయవ దానం చేసి 9మంది జీవితాల్లో వెలుగులు నింపారు చరితారెడ్డి కుటుంబ సభ్యులు. విధి ఆడిన వింత ఆటలో బలైపోయి చనిపోయిన చరితారెడ్డి మరో 9మందిని బతికించింది.

తెలంగాణా సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కొత్త సంకల్పం ... 2020లో ఆయన నినాదం ఇదేతెలంగాణా సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కొత్త సంకల్పం ... 2020లో ఆయన నినాదం ఇదే

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన చరితారెడ్డి

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన చరితారెడ్డి

రెండ్రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన చరితారెడ్డి మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును.. వెనక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడంతో బ్రెయిన్‌డెడ్‌కు గురైంది చరితారెడ్డి. ఆమెతో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ముస్కేగాన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చరితారెడ్డి బ్రెయిన్‌ డెడ్ కాగా ఆమె ఏమాత్రం తిరిగి మామూలు మనిషి అయ్యే అవకాశం లేకపోవటంతో ఆమె తల్లిదండ్రులు అవయవ దానం చెయ్యాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

అవయవదానం చేసి 9 మందికి ప్రాణం పోసిన చరిత

అవయవదానం చేసి 9 మందికి ప్రాణం పోసిన చరిత

కారు యాక్సిడెంట్‌లో బ్రెయిన్ డెడ్‌ అయిన చరితారెడ్డి అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోసి తొమ్మిది కుటుంబాల్లో వెలుగు నింపాయి . ఆమె కుటుంబం బిడ్డ మృత్యువాత పడినా మరో తొమ్మిది మంది జీవితాల్లో బతికే ఉందని తమ బిడ్డను చూసి గర్వ పడుతున్నామని చెప్తున్నారు .ఆ తొమ్మిదిమందిలో వారిలో తమ బిడ్డ బతికే ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు చరితా తల్లిదండ్రులు.

9మందిని బతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అన్న అమెరికా సమాజం

9మందిని బతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అన్న అమెరికా సమాజం

సోమవారం ఆమె కుటుంబ సభ్యుల పర్మిషన్‌తో చరితారెడ్డి అవయవాలు డొనేట్ చేశారు డాక్టర్లు. గిఫ్ట్ లైఫ్ హాస్పిటల్‌లో ఆమె అవయవదానం జరిగింది. . మొత్తం 9మందికి ఆమె అవయవాలు అమర్చి ప్రాణదానం చేశారు.ఇక ఆమె మృతి తొమ్మిది మందికి జీవితాన్నివ్వటం పట్ల 9మందిని బతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అంటూ ఇప్పుడు అమెరికా సమాజం ఆమెను కొనియాడుతుంది . అంత విషాదంలోనూ ఆమె ఫ్యామిలీ గొప్ప నిర్ణయం తీసుకుందని అమెరికా సమాజం చెప్తోంది .

 షీ ఈజ్ అవర్ సూపర్ హీరో అన్న కుటుంబం .. ఆమె చరిత శాశ్వతం

షీ ఈజ్ అవర్ సూపర్ హీరో అన్న కుటుంబం .. ఆమె చరిత శాశ్వతం

విషాదంగా ముగియాల్సిన మరికొందరి జీవితాల్లో చరితారెడ్డి వెలుగులు నింపారంటూ అక్కడి వైద్యులు ఆమె విషయంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రుల గొప్పతనాన్ని కొనియాడారు. షీ ఈజ్ అవర్ సూపర్ హీరో అంటూ చరితారెడ్డి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు ఆమె కుటుంబసభ్యులు. చనిపోయినా.. 9 మంది జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వనిత చరితా రెడ్డి. సార్ధక నామధేయురాలు. ఆమె లేకున్నా ఆమె చరిత శాశ్వతం . 9 మందిలో ఆమె సజీవం .. ఆమె త్యాగాన్ని అటు అమెరికా సమాజమే కాదు ఇటు భారతీయ సమాజం కూడా కొనియాడుతుంది. జోహార్ చరితా రెడ్డి అని నినదిస్తుంది.

English summary
In a tragic incident, a Hyderabadi woman who went to the US, has died in a road accident. The deceased identified as Aella Charitha Reddy (25) resides in Michigan and works as a software engineer. Charita reddy brain dead in the car accident. parents donates her organs to 9 memebers who are seriously suffering . Her family says they are proud to see their baby still alive in those 9 members .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X