హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛీ.. ఛీ.. ఎరా వడపప్పు తిని ఒళ్లు పెంచావ్: మహేష్ కత్తిపై హైపర్ ఆది 'పంచ్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఛీ.. ఛీ.. ఎరా వడపప్పు తిని ఒళ్లు పెంచావ్: మహేష్ కత్తిపై హైపర్ ఆది 'పంచ్'

హైదరాబాద్: కోట్లాది మంది పూజించే శ్రీరాముడిపై వివాదాస్పద సినీ ప్రముఖుడు మహేష్ కత్తి తీవ్ర విమర్శలు చేయడంపై దుమారం రేగుతోంది. ఆయనపై హిందూ సమాజంలోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. మత ఘర్షణలు సృష్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్వామి పరిపూర్ణానంద నుంచి నాగబాబు వరకు ఆగ్రహించారు.

మహేష్ కత్తి ఖేల్ ఖతమ్! హైదరాబాద్ వచ్చినా, పోస్ట్ పెట్టినా జైలుకే, టీవీ ఛానల్‌కు డీజీపీ షాక్మహేష్ కత్తి ఖేల్ ఖతమ్! హైదరాబాద్ వచ్చినా, పోస్ట్ పెట్టినా జైలుకే, టీవీ ఛానల్‌కు డీజీపీ షాక్

జబర్దస్త్ నటుడు హైపర్ ఆది కూడా మహేష్ కత్తిపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. కొన్ని కోట్ల మంది దేవుడిగా కొలుస్తున్న శ్రీరాముడిని కూడా విమర్శలు చేస్తుంటే వారిని తీసుకు వచ్చి న్యూస్ ఛానల్స్‌లలో కూర్చుండబెట్టారని మండిపడ్డారు.

ఛీ.. ఛీ.. ఎరా వడపప్పు, పానకం తిని ఒళ్లు పెంచినట్లున్నావ్

ఛీ.. ఛీ.. ఎరా వడపప్పు, పానకం తిని ఒళ్లు పెంచినట్లున్నావ్

ఒకడేమో రాముడు దేవుడు కాదని అంటాడని, ఇంకొకడేమో సీతను విమర్శిస్తాడు, ఇంకొకడేమో రాముడి పుట్టుక గురించి మాట్లాడుతాడు, ఇంకోడు రాముడిని దగుల్భాజి అంటాడని, ఛీ.. ఛీ.. ఛీ.. ఎరా.. శ్రీరామ నవమికి పెట్టే వడపప్పు, పానకం తిని ఒళ్లు పెంచినట్లున్నావా.. ఎలా వచ్చాయిరా నీకు ఆ మాటలు అని మహేష్ కత్తిపై మండిపడ్డారు.

మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం

మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం

తనకు క్రిస్టియన్లు, ముస్లీంలు.. ఇలా అందరూ స్నేహితులు ఉన్నారని, క్రిస్‌మస్, రంజాన్ వస్తే నేను వారి ఇంటికి వెళ్లి భోజనం చేస్తానని, సంక్రాంతికి వారు తన ఇంటికి వచ్చి భోజనం చేస్తారన్నారు. నేను ఊరు వెళ్తుంటే దారిలో మసీదు, చర్చి, గుడి కనిపించినా దండం పెట్టుకుంటానని చెప్పారు. ఇలా ఐకమత్యంగా ఉండే మన దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మీ పబ్లిసిటీ కోసం దేవుళ్ల పైన రివ్యూలా?

మీ పబ్లిసిటీ కోసం దేవుళ్ల పైన రివ్యూలా?

అరె.. మీ పబ్లిసిటీ కోసం మనుషుల మధ్యనే కాకుండా, దేవుడి మీదనే రివ్యూలు రాసేసి, మా హీరో.. మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు.. మా దేవుడు అని కొట్టుకునే పరిస్థితులు కూడా పెంచుతున్నారని హైపర్ ఆది మండిపడ్డారు... సూపర్.. సర్, మీ అందరికీ హిందూ మతాన్ని కించపరుస్తుంటే ఇది తప్పు అని చెప్పలేనంత బిజీగా ఉన్నారని నేను అనుకోవడం లేదన్నారు. కాబట్టి మీరు అందరూ ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీకు ఇది తప్పు అనిపిస్తే ఖండించండి సర్ అని విజ్ఞప్తి చేశారు.

అందరి దేవుళ్లు ఒక్కటే, అందరూ మద్దతివ్వాలి

అందరి దేవుళ్లు ఒక్కటే, అందరూ మద్దతివ్వాలి

అలాగే, పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్రకు మద్దతివ్వాలని కూడా విజ్ఞప్తి చేసారు. (అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలనుకున్న ఈ యాత్రను పోలీసులు అడ్డుకొని, పరిపూర్ణానంద స్వామిని హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.) అతని (మహేష్ కత్తి) వ్యాఖ్యలు తప్పు అనిపిస్తే మతబేధం లేకుండా ఖండించాలని కోరారు. కానీ దేవుడ్ని తిట్టిన విషయంలో కూడా మద్దతివ్వడం మంచిది కాదన్నారు. కొందరు దానిని సపోర్ట్ చేస్తున్నారని, ఆలోచించాలన్నారు. అందరు దేవుళ్లు ఒక్కటే అన్నారు.

ఎవరి మనోభావాలు గాయపర్చడని నమ్మకం

కత్తి మహేష్ హైదరాబాద్ బహిష్కరణకు గురైన విషయమై ఆయన తండ్రి ఓబులేసు స్పందించారు. పరిపూర్ణానందస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిష్కరించాల్సింది తన కుమారుడిని కాదని, ఆయననే అన్నారు. దళితుడు కాబట్టే తన కుమారుడి వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తన కుమారుడు హిందువేనని, ఆస్తికుడని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే తన కుమారుడిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. నా కుమారుడు ఉన్నత చదువులు చదివాడని, అకారణంగా ఎవరి మనోభావాలు గాయపర్చడని భావిస్తున్నానని చెప్పారు.

English summary
Jabardhasth Hyper Aadi Serious Comments On controversial Kathi Mahesh. He urged all support against Mahesh Kathi comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X