• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫోటో ఎఫెక్ట్, దిమ్మతిరిగే షాక్: మహేష్ కత్తిపై హైపర్ ఆది మరో 'జబర్దస్త్' పంచ్

|
  మహేష్ కత్తిపై హైపర్ ఆది 'జబర్దస్త్' పంచ్ !

  హైదరాబాద్: మహేష్ కత్తి పైన జబర్దస్త్ ఆది మరో పంచ్ వేశారా? జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వేసే పంచ్‌లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. నెట్లోను ఆయన జబర్దస్త్ వీడియోలకు బాగా వ్యూస్ వస్తాయి.

  చదవండి: అర్థంకాడు, నేనెవర్ని చెప్పడానికి: పవన్‌పై కేటీఆర్, అల్లు అర్జున్, సమంత, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌లపై

  హైపర్ ఆది స్పాంటేనియస్‌గా కూడా పంచ్‌లు వేయగల సమర్థుడు అని అంటుంటారు. స్కిట్‌లోను అప్పటికి అప్పుడు అవసరమైతే పంచ్‌లు వేస్తుంటామని ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. జబర్దస్త్‌లో తనదైన పంచ్‌లతో అందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్న ఆది ఇటీవల మరో రకంగాను వార్తల్లో నిలిచారు.

  చదండి: 'స్వరం మార్చిన రోజా, జగన్‌కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు'

  హైపర్ ఆది వర్సెస్ మహేష్ కత్తి

  హైపర్ ఆది వర్సెస్ మహేష్ కత్తి

  తనను తాను ప్రమోషన్ చేసుకునేందుకు, నిత్యం మీడియాలో నానేందుకు కత్తి మహేష్ పదేపదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తన స్కిట్‌లో హైపర్ ఆది తనపై సెటైర్ వేశారని మహేష్ కత్తి ఆరోపించారు. ఆది మాత్రం నీపైన నేను ఎందుకు వేస్తానని సూటిగా సమాధానం చెప్పారు.

  గతంలోను ఓ స్కిట్‌లో హైపర్ ఆది

  గతంలోను ఓ స్కిట్‌లో హైపర్ ఆది

  పవన్ కళ్యాణ్‌కు ఉన్న లక్షలాది మంది అభిమానుల్లో హైపర్ ఆది కూడా ఒకరు. మహేష్ కత్తి జనసేనానిని టార్గెట్ చేసుకోవడం వల్లే ఆయన తన స్కిట్‌లో సెటైర్ వేశారని అంటున్నారు. ముందు పొట్ట, వెనుక బట్టతల వేసుకొని రివ్యూలు రాసినంత సులభం కాదని గతంలో ఓ స్కిట్‌లో హైపర్ ఆది అంటారు.

  మహేష్ కత్తి ఇలా, హైపర్ ఆది అలా

  మహేష్ కత్తి ఇలా, హైపర్ ఆది అలా

  దీనిపై టీవీ ఛానల్స్‌లో ఇరువురి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. తాను ఇమేజ్ కోసం పవన్‌ను విమర్శించలేదని నమ్మించే ప్రయత్నాలను మహేష్ కత్తి చేశారు. హైపర్ ఆది కూడా నేను నిన్ను టార్గెట్ చేయలేదని, తనకు సుత్తి రాజేష్ అనే స్నేహతుడు ఉన్నాడని, అతనిపై తాను సెటైర్ వేశానని చెప్పారు. తన పేరు కోసం పవన్‌ను విమర్శిస్తున్నానని మహేష్ కత్తి చెప్పకపోవడం వల్లే, నేను కూడా నిన్ను టార్గెట్ చేయడం లేదని హైపర్ ఆది చెప్పినట్లుగా చాలామంది భావిస్తున్నారు. అయితే, అదే షోలో హైపర్ ఆది మాట్లాడుతూ.. పవన్‌ను సుత్తి రాజేష్ లాంటి వారు అంటే తాను కచ్చితంగా స్పందిస్తానని చెప్పారు.

  తాజా స్కిట్‌లో దిమ్మతిరిగే కౌంటర్

  తాజా స్కిట్‌లో దిమ్మతిరిగే కౌంటర్

  ఈ నేపథ్యంలో తాజా స్కిట్‌లో హైపర్ ఆది చేసిన ఓ కామెంట్ మహేష్ కత్తిని ఉద్దేశించి చేసిందే అయి ఉంటుందని అంటున్నారు. గురువారం నాటి స్కిట్‌లో హైపర్ ఆది మాట్లాడుతూ.. 'నువ్వు ఫోటో దిగుతావు. ఫేస్‌బుక్‌లో పెడతావు. మేము మేమూ బాగుంటాం మధ్యలో పిచ్చివాళ్లు అయ్యేది పేరెంట్స్ అంటావు. ఆ తర్వాత నాకు పిచ్చి లేస్తుంది.' అని అంటారు. ఈ వ్యాఖ్య కత్తి మహేష్‌ను ఉద్దేశించే అని భావిస్తున్నారు.

  ఇదీ అసలు విషయం

  ఇదీ అసలు విషయం

  అందుకు ఓ కారణం ఉంది. గతంలో కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేయబోయి ఓ విధంగా అందరి ఫ్యాన్స్‌కు వర్తించినట్లుగా తీవ్రమైన కామెంట్లు పెట్టారు. హైపర్ ఆదితో ఓ షోలో వాదన జరిగిన అనంతరం మహేష్ కత్తి తాను ఆదితో దిగిన ఓ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, 'కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్ధాంతాలకు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్‌ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెధవలు అయ్యేది మీరే!' అని అభిమానులను గాయపరిచేలా పోస్ట్ పెట్టారు. దీనిని ఉద్దేశించే హైపర్ ఆది తాజా స్కిట్‌లో సెటైర్ వేశారని అంటున్నారు.

  English summary
  Well Known Jabardhasth comedian Hyper Adi jabardasth punch on Mahesh Kathi?
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X