నాపై అవాస్తవాలు వద్దు: అనిల్ కుమార్‌తో భేటీపై ఎమ్మెల్యే రాజయ్య క్లారిటీ, ఏమన్నారంటే.?
హైదరాబాద్: తాను రాజకీయ ఓనమాలు నేర్చింది కాంగ్రెస్ పార్టీలోనే అయినప్పటికీ.. తన ఎదుగుదల మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లోనేనని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్‌కు
షాకిస్తారా?:
వైఎస్
షర్మిల
భర్త
అనిల్
కుమార్‌తో
ఎమ్మెల్యే
రాజయ్య
భేటీ,
ఏం
చర్చించారు?

అనిల్ కుమార్‌తో భేటీపై రాజయ్య క్లారిటీ..
ఆదివారం లోటస్‌పాండ్‌లో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భర్త అనిల్ కుమార్‌ను కలిసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. అది వందశాతం ఫేక్ న్యూస్ అని అన్నారు. తన వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు ముడిపెట్టొద్దని అన్నారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని రాజయ్య హెచ్చరించారు. 2019 సంవత్సరంలో ఒక క్రైస్తవ సమావేశానికి ముందు అనిల్ కుమార్‌ను కలిసినప్పుడు దిగిన ఫొటో అది అని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం మొదలుపెట్టిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది సత్యదూరమైన వార్త, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాజయ్య తెలిపారు.

కేసీఆర్ ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీలోనే ఎదిగానంటూ రాజయ్య
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యత సీఎం కేసీఆర్ తనకు ఇచ్చారని రాజయ్య చెప్పారు. తనకు ఇష్టమైన వైద్యారోగ్య శాఖను అప్పజెప్పారని తెలిపారు. అడగముందే డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారని ఈటల తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తాను టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగానని రాజయ్య తెలిపారు. ఉపముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు అంటగట్టడం సరికాదన్నారు. కేసీఆర్ దళితుల పక్షపాతిగా కొనసాగుతున్నారని అన్నారు. ఇవాళ దళితులు తలెత్తుకుని తిరిగి వేధంగా దళితబంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని రాజయ్య ప్రశంసించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో ఉందా? అని ప్రశ్నించారు.

రాజయ్య-అనిల్ కుమార్ ఫొటో వైరల్ కావడంతో..
కాగా, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తో ఎమ్మెల్యే రాజయ్య ఉన్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఆదివారంనాడు రాజయ్య.. అనిల్‌తో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రాజయ్య త్వరలోనే టీఆర్ఎస్ పార్టీని వీడి.. షర్మిల పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజయ్య మీడియా ముందుకు వచ్చి తాను టీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. తాను డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలిగినప్పుడు పలు రాజకీయ పార్టీలు తనను కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ తాను వెళ్లలేదని చెప్పారు. కాగా, షర్మిల పార్టీలో ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన కొందరు నాయకులు చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో మరికొందరు ఆ పార్టీని వీడారు. ఈ క్రమంలో షర్మిల పార్టీ రాజయ్య చేరతారనే ప్రచారం జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, రాజయ్య క్లారిటీ ఇవ్వడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని తేలిపోయింది. షర్మిల ప్రస్తుతం రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ.. సీఎం కేసీఆర్‌పై విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలున్నాయని.. కానీ, రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదని విమర్శలు గుప్పించారు.