హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్, నాయిని హెచ్చరికలు: క్షమాపణ చెప్పను, సిద్ధమని డిగ్గీ

తెలంగాణ రాష్ట్ర పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారం అన్నారు. తనపై ఎలాంటి కేసులు పెట్టినా అభ్యంతరం లేదని చెప్పారు. న్యాయ పోరాటానికి సిద్ధమని చెప్పారు.

ఓ పక్కన ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెబుతూ మరోవైపు ముస్లీంలను పక్కదోవ పట్టించడం ఏమాత్రం సరికాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు.

<strong>ఇలాంటి వ్యాఖ్యలా?, కాంగ్రెస్ నాశనమే: డిగ్గీపై డీఎస్ తీవ్ర వ్యాఖ్యలు</strong>ఇలాంటి వ్యాఖ్యలా?, కాంగ్రెస్ నాశనమే: డిగ్గీపై డీఎస్ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు దిగ్విజయ్ సింగ్ క్షమాపణ చెప్పాలని లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.

I am ready to legal fight: Digvijay

తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని మంత్రి నాయిని నర్సింహా రెడ్డి డిమాండ్‌ చేశారు

దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై ఇప్పటికే తమ శాసనసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని, లేదంటే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.

English summary
Congress Leader Digvijay Singh on Tuesday said that he is not ready to apology for comments on TS police. He said that he is ready to legal fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X