వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను బతికే ఉన్నాను ... ఆస్థి కోసం నా కొడుకు నన్ను చంపేశాడని ఓ తల్లి న్యాయపోరాటం

|
Google Oneindia TeluguNews

అయ్యా నేను బ్రతికే ఉన్నాను.. ఆస్తి కోసం నా కొడుకు నేను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించాడు. నా ఆస్తినంతా కబ్జా చేశాడు.. నాకు న్యాయం చేయండి అంటూ ఓ తల్లి దీనంగా వేడుకుంది. ఇక తన సమస్య గురించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య కు వినతిపత్రం అందజేసి మరి తనకు న్యాయం చేయమని వేడుకుంటుంది.

 అమ్మను మోసుకుంటూ పింఛన్ కోసం ఓ కుమారుడి పోరాటం .. ఏపీ అధికారులూ స్పందించండి అమ్మను మోసుకుంటూ పింఛన్ కోసం ఓ కుమారుడి పోరాటం .. ఏపీ అధికారులూ స్పందించండి

తనకున్న భూమిని కౌలుకిచ్చి జీవనం సాగిస్తున్న భద్రమ్మ

తనకున్న భూమిని కౌలుకిచ్చి జీవనం సాగిస్తున్న భద్రమ్మ

ఇక అసలు విషయానికొస్తే బయ్యారం మండల కేంద్రానికి చెందిన కొండ్రెడ్డి భద్రమ్మ కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ వివాహం చేసి ఆస్తి సమానంగా పంచిన ఆమె భర్త చంద్రయ్య కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఇక ముగ్గురు కుమారులలో ఇద్దరు కుమారులు కూడా మరణించారు. ప్రస్తుతం ఆమెకు పెద్ద కుమారుడు మాత్రమే ఉన్నాడు. అయితే భద్రమ్మ ఆమె పేరు మీద ఉన్న 2.06 ఎకరాల భూమిని కౌలుకిచ్చి దాని ద్వారా వచ్చే డబ్బులతో జీవనం గడుపుతూ ఉంది. రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన భద్రమ్మ కొడుకు చేసిన ఘనకార్యం తెలిసి కన్నీరుమున్నీరవుతోంది.

తల్లి చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్థి తనపరుకు మార్చుకున్న కొడుకు

తల్లి చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్థి తనపరుకు మార్చుకున్న కొడుకు


భద్రమ్మ పేరుమీద ఉన్న భూమిని ఆమె చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కొడుకు సోమిరెడ్డి తన పేరు మీద పట్టా చేయించుకున్నాడని భద్రమ్మ లబోదిబోమంటున్నారు. తనకు రైతు బంధు రాకపోవటంతో అధికారుఅలను అడిగిన ఆమెకు ఈ విషయం చెప్పారు సదరు అధికారులు. తాను బతికే ఉన్నానని, అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా నేను చనిపోయానని నిర్ధారించి, నా కుమారుడి పేరు మీద భూమిని పట్టా చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె వాపోతోంది. ఇక దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి తన భూమి తనకు ఇప్పించాలని, దాని మీదనే ఆధారపడి బ్రతుకుతున్నానని భద్రమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది.

న్యాయం కోసం తల్లి పోరాటం .. చర్య తీసుకోవాలని, న్యాయం చెయ్యాలని వినతి

న్యాయం కోసం తల్లి పోరాటం .. చర్య తీసుకోవాలని, న్యాయం చెయ్యాలని వినతి

సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని, ఇప్పటికైనా అధికారులు తనకు జరిగిన అన్యాయంపై స్పందించాలని, న్యాయం అందించాలని భద్రమ్మ కోరుతోంది.

కన్నకొడుకే బ్రతికున్న తల్లిని ఆస్తి కోసం చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆమె జీవనాధారమైన భూమిని కూడా లేకుండా చేయడంతో ఆ తల్లి నిజంగానే జీవశ్చవం గా మారిపోయింది. కొడుకు చేసిన పనికి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నేను బ్రతికి ఉన్నాను అంటూ అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది. అధికారులు స్పందించాలని కోరుకుంటోంది.

English summary
Bhadramma is claiming that her son Somireddi has graduated the land in the name of Bhadramma by her death certificates. She claims that she is still alive and that it is reasonable for me to grabbed to the land in the name of my son to ensure that I am dead without any further investigation by the authorities.Bhadramma has brought it to the collector's attention that the land should be given to him by a full inquiry into the matter and that she is living on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X